పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్? OG 2పై సుజీత్ షాకింగ్ డెసిషన్..

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినాను చాటి చెప్పి, ఆయన అభిమానులకు మంచి విందు భోజనాన్ని అందించిన మూవీ ఓజీ. సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పవన్ నట విశ్వరూపానికి బాక్సాఫీస్ షేక్ అయ్యింది. పవన్ కళ్యాణ్‌ను అభిమానులు ఎలా చూడాలని అనుకుంటున్నారో అలా చూపించి బ్లాక్‌బస్టర్ కొట్టారు సుజీత్. పవన్ నట జీవితంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఓజీ నిలిచింది. ఇదే ఊపులో ఓజీ 2ని కూడా పట్టాలెక్కించాలని అభిమానుల నుంచి డిమాండ్స్ ఊపందుకోగా.. పవన్- సుజీత్‌లు కూడా చేయడానికి ముందుకొచ్చారు. అయితే అది ఇప్పుడు కాదని.. భవిష్యత్తులో ఉంటుందని స్పష్టం చేశారు.

Also Read
నా బిడ్డకు తండ్రి ఆ హీరోయే... జడ్జి ముందు నటి హల్‌చల్
నా బిడ్డకు తండ్రి ఆ హీరోయే... జడ్జి ముందు నటి హల్‌చల్

గతేడాది సెప్టెంబర్ 25న విడుదలైన ఓజీ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో తొలిసారిగా 300 కోట్ల రూపాయల కలెక్షన్స్‌ను క్రాస్ చేసి సరికొత్త రికార్డులు సృష్టించింది. హరిహర వీరమల్లు డిజాస్టర్‌తో నిరాశలో ఉన్న పవన్ ఫ్యాన్స్‌కు ఓజీతో అదిరిపోయే హిట్ అందించారు సుజీత్. అటు మెగా ఫ్యామిలీ కూడా ఓజీని వీక్షించి సుజీత్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఇక పవన్ సంగతి చెప్పనక్కర్లేదు.. ఈ విజయం ఆయనలో మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. సుజీత్‌ను పవన్ తనదైన శైలిలో సర్‌ప్రైజ్ చేశారు. తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను అందించినందుకు గాను సుజీత్‌కు ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును బహుమతిగా అందించారు పవర్‌స్టార్.

Pawan Kalyan s OG 2 Buzz Grows Stronger as Director Sujeeth Begins Script Work

ఓజీకి సీక్వెల్‌ తీయాలన్న అభిమానుల కోరికను మన్నించిన పవన్ కళ్యాణ్.. గతంలోనే ఓజీ యూనివర్స్ కోసం ఎదురుచూస్తున్నానని చెప్పి ఓజీ 2కి సూత్రప్రాయంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అటు ఓజీ 2 కోసమే ఓజీ మొదటి భాగం ఎండింగ్‌లో కొన్ని లీకులు ఇచ్చారు సుజీత్. జపాన్‌లో ఓజీ ఏం చేశాడు? అక్కడ యాకూజా గ్యాంగ్‌ను ఎలా ఎదుర్కొన్నాడు? అనేది చూపించలేదు. బహుశా ఓజీ యూనివర్స్ కోసమే జపాన్ ఎపిసోడ్‌పై లీకులిచ్చి వదిలిపెట్టాడని సినీజనాలు భావిస్తున్నారు.

Recommended For You
'ఆ యాంకర్ బెడ్ నిండా అవే... ఈ టైంలో మొగుడితో ఉండాలి కానీ’
'ఆ యాంకర్ బెడ్ నిండా అవే... ఈ టైంలో మొగుడితో ఉండాలి కానీ’

ఈ లోపు పవన్ కళ్యాణ్ రాజకీయాలతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్‌లో బిజీ అయ్యారు. అటు సుజీత్ సైతం నేచురల్ స్టార్ నాని హీరోగా ది బ్లడీ రోమియో ప్రాజెక్ట్ వర్క్‌లో తలమునకలయ్యాడు. మాస్ ఇమేజ్‌పై ఫోకస్ పెట్టిన నాని.. తన కథలు, దర్శకుల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే శ్రీకాంత్ ఓదెలతో ది ప్యారడైజ్ చేస్తున్న ఆయన.. ఆ తర్వాత సుజీత్, సీబీ చక్రవర్తి వంటి యంగ్ దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీటితో ది ప్యారడైజ్ తర్వాత బ్లడీ రోమియోను పట్టాలెక్కించాలని నాని పట్టుదలతో ఉన్నారు. అయితే నాని జోరుకు ది ప్యారడైజ్ బ్రేక్‌లు వేస్తోంది.

You May Also Like
'నా జీవితం టీవీలో హెడ్‌లైన్‌ కావొద్దు... అమ్మాయిలకు ఆ 2 నిమిషాలే’
'నా జీవితం టీవీలో హెడ్‌లైన్‌ కావొద్దు... అమ్మాయిలకు ఆ 2 నిమిషాలే’

2026 సమ్మర్ కానుకగా రావాల్సిన ఈ సినిమా ఆగస్ట్ 21కి వాయిదా పడింది. తన పూర్తి కాల్‌షీట్స్, సమయాన్ని ప్యారడైజ్ కోసమే వెచ్చిస్తున్నారు నాని. దాంతో బ్లడీ రోమియో ఆలస్యమవుతోంది. ట్రెండ్స్‌ను బట్టి చూస్తుంటే ఈ ఏడాది చివరిలో లేదంటే 2027 ప్రారంభంలో బ్లడీ రోమియో పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయని ఫిలింనగర్ టాక్. ఈ సినిమా ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తుండటంతో సుజీత్ సంచలన నిర్ణయం తీసుకున్నారట. ఓజీ 2 స్క్రిప్ట్‌ను పట్టాలెక్కించే పనపిలో ఆయన ఉన్నారట.

'బిగ్‌బాస్‌ హౌస్‌లో మనిషిలా చూడలేదు... జీవితాంతం ఆ బాధ నా గుండెల్లోనే’
'బిగ్‌బాస్‌ హౌస్‌లో మనిషిలా చూడలేదు... జీవితాంతం ఆ బాధ నా గుండెల్లోనే’

బ్లడీ రోమియో సెట్స్ పైకి వెళ్లే నాటికి ఓజీ 2 స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి పవన్ కళ్యాణ్‌తో ఆమోదముద్ర వేయించుకోవాలని సుజీత్ ప్లాన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా 2029 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నాటికి వీలైనన్ని సినిమాలు చేసి అభిమానులను అలరించే ప్లాన్‌తో ఉన్నారు. షూటింగ్‌ని లేట్ చేయకుండా వేగంగా కంప్లీట్ చేసేవారికి ఆయన అవకాశాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. దీనిని బట్టి చూస్తే ఓజీ 2 కూడా అతి త్వరలోనే పట్టాలెక్కే అవకాశం ఉంది. మరి సుజీత్ - పవన్ కళ్యాణ్‌ల మనసులో ఏముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

Read more about: pawan kalyan og sujeeth
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X