పింక్ రీమేక్ అప్‌డేట్స్.. టైటిల్‌కు ముహూర్తం, సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఘట్టం వచ్చింది. తమ అభిమాన హీరో ఒక్క సినిమాలో నటిస్తే చాలు అనుకన్న అభిమానులకు షాక్ ల మీద షాక్‌లు ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్. పింక్ రీమేక్ చిత్రాన్ని మొదలు పెట్టడం ఆలస్యం.. వారం గ్యాప్‌లోనే కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టేశాడు. సరే ఇది బోనస్ అనుకుని సంబరపడిపోయారు ఫ్యాన్స్. మరో వారం గ్యాప్‌లో హరీష్ శంకర్‌తో ఓ సినిమాను ప్రకటించి అందర్నీ షాక్‌కు గురిచేశాడు.

శర వేగంగా పింక్ రీమేక్..
పింక్ రీమేక్‌కు పవన్ కళ్యాణ్ ఇచ్చి డేట్స్ చాలా తక్కువని అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. పవన్ సీన్స్‌కు సంబంధించిన షూట్‌ను మొదటగా కానిచ్చేయాలని ప్లాన్ చేస్తున్నారట. షూటింగ్ శరవేగంగా జరగాలని, సమ్మర్లోనే చిత్రాన్ని విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట మేకర్స్.

లీకులపై ఫైర్..
గుట్టు చప్పుడు కాకుండా.. సినిమాను పూర్తి చేసేయాలని అనుకన్న పవన్‌కు మొదటి రోజే ఎదురు దెబ్బ తగిలింది. మొదటి రోజు నుంచే లీకులు మొదలయ్యాయి. షూటింగ్ స్పాట్‌లోనుంచి పవన్ కళ్యాణ్ స్టిల్స్ సోషల్ మీడియాలో లీకయ్యాయి.

తాజాగా మరో అప్‌డేట్..
పింక్ రీమేక్ చిత్రానికి టైటిల్ అంటూ కొన్ని పేర్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. లాయర్ సాబ్ అంటూ మ్యాన్ మేడ్ పోస్టర్లు కూడా హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీటికి పుల్‌స్టాప్ పెట్టేందుకు మూవీ యూనిట్ డేట్‌ను ఫిక్స్ చేసింది. ఉగాది రోజున ఈ మూవీ టైటిల్‌ను అనౌన్స్ చేయనున్నట్లు ప్రకటించారు.

సమ్మర్‌లో విడుదల..
శర వేగంగా షూటింగ్ జరపుకుంటోన్న ఈ మూవీని సమ్మర్లోనే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయింది మూవీ యూనిట్. అంతే కాకుండా రిలీజ్ డేట్‌ను కూడా ఫిక్స్ చేసేశారు. మే 15న ఈ మూవీని విడుదల చేయబోతోన్నట్టు ప్రకటించారు.


Click it and Unblock the Notifications











