For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

    రూ. 120 కోట్ల లాస్: ఆదుకోవాలని ఉన్నా ఏమీ చేయలేక పవన్ కళ్యాణ్ బయటకు!

    By Bojja Kumar
    |
    రూ. 120 కోట్ల లాస్.. ఆదుకోవాలని ఉన్నా ఏమీ చేయలేక పవన్..!

    సినిమా వ్యాపారం అంటే జూదం లాంటిదే అని అంటుంటారు. ఒక సినిమా హిట్టవుతుందా? లేదా? అనేది విడుదల అయ్యే వరకు ఎవరూ చెప్పలేరు. సినిమా రంగంలోకి వచ్చి అదృష్టం కలిసొచ్చి హిట్స్ కొట్టి కోట్లకు పడగలెత్తినవారు..... కోట్ల ఆస్తులను పోగొట్టుకుని రోడ్డున పడ్డవారు ఎందరో ఉన్నారు.

    తమతో సినిమాలు తీసి నష్టపోయిన వారిని ఆదుకునేందుకు కొందరు పెద్ద పెద్ద స్టార్స్ తమ వంతు ప్రయత్నం చేస్తుండటం తరచూ చూస్తున్నాం. నష్టపోయిన నిర్మాతకు మళ్లీ ఫ్రీగా సినిమా చేసి పెట్టడమో? నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్ల నష్టాలు ఎంతో కొంత పూడ్చేలా తమ తర్వాతి సినిమా రైట్స్ ఇప్పించడం లాంటివి చేస్తుంటారు. అలా తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు అండగా ఉండే వారిలో ప్రముఖుడు పవన్ కళ్యాణ్.

     వరుస ప్లాపులు

    వరుస ప్లాపులు

    పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలు వదిలేసి రాజకీయాల్లో సీరియస్ గా ఎంటరైన సంగతి తెలిసిందే. ఆయన రాజకీయ ఎంట్రీకి ముందు మూడు సినిమాలు చేశారు. ఆ మూడు చిత్రాలు భారీగా నష్టలే మిగిల్చాయి.

     సర్దార్ గబ్బర్ సింగుతో మొదలు

    సర్దార్ గబ్బర్ సింగుతో మొదలు

    ‘అత్తారింటికి దారేది' హిట్ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్'. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. ఈ చిత్రం వల్ల దాదాపు రూ. 20 కోట్ల నష్టం ఏర్పడినట్లు అంచనా.

     కాటమరాయుడి వల్ల ఎంత నష్టం?

    కాటమరాయుడి వల్ల ఎంత నష్టం?

    హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ సినిమాలకు బిజినెస్ జరుగుతూ ఉంటుంది. ‘సర్దార్ గబ్బర్ సింగ్' తర్వాత వచ్చిన ‘కాటమరాయుడు' చిత్రానికి దాదాపు రూ. 90 కోట్ల బిజినెస్ జరిగింది. అయితే రికవరీ అయింది కేవలం 61 కోట్లు మాత్రమే. దీంతో 30 కోట్ల నష్టం తప్పలేదు. వాస్తవానికి ఈ చిత్రం ద్వారా ‘సర్దార్ గబ్బర్ సింగ్' వల్ల నష్టపోయిన వారిని ఆందుకుందామనుకున్నారు. అది జరుగక పోగా.... మళ్లీ నష్టమే మిగిలింది.

     కాంబినేన్ క్రేజ్ కూడా ఫెయిల్

    కాంబినేన్ క్రేజ్ కూడా ఫెయిల్

    పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే ముందు నుండి మంచి క్రేజ్ ఉంది. దీంతో ఇటీవల వచ్చిన ‘అజ్ఞాతవాసి' సినిమాకు గత రెండు ప్లాపులతో సంబంధం లేకుండా రూ. 125 కోట్ల బిజినెస్ జరిగింది. అయితే సినిమా ప్లాప్ కావడంతో గత రెండు చిత్రాలను మించిన నష్టం వాటిల్లింది. ఈ ఒక్క చిత్రం ద్వారానే దాదాపు 70 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా..

    టోటల్ లాస్ 120 కోట్లు

    టోటల్ లాస్ 120 కోట్లు

    పవన్ కళ్యాణ్ నటించిన గత 3 సినిమాల ద్వారా టోటల్ లాస్ రూ. 120 కోట్లు. అయితే పవన్ కళ్యాణ్ సినిమాలను వదిలేసి రాజకీయాల్లోకి వచ్చిన నేపథ్యంలో ఈ 120 కోట్లు రికవరీ కానీ నష్టంగానే మిగిలిపోయిందనే టాక్ వినిపిస్తోంది.

     ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పవన్

    ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పవన్

    వాస్తవానికి పవన్ కళ్యాణ్ తన సినిమాల వల్ల నష్టపోయిన వారిని ఆదుకోవడానికి తన శక్తి మేర ప్రయత్నిస్తుంటారు. అయితే ఆ ప్రయత్నంలో భాగంగా పవన్ కళ్యాణ్ చేసిన మూడు చిత్రాలు నష్టాలను పూడ్చక పోగా ఒకదాన్ని మించి మరొకటి మరింత నష్టపరిచాయి. దీంతో ఆదుకోవాలి ఉన్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పవన్ కళ్యాణ్ సినిమాలను వీడక తప్పలేదు.

    English summary
    Pawan Kalyan's recent films total loss 120 crores. Pawan Kalyan's recent films Sardaar Gabbar Singh, Katamarayudu, Agnyaathavaasi gave the biggest jolt to everyone in the business by ending up a disaster.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more