twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫ్యాన్స్ కోసం పవన్ కళ్యాణ్...ఒప్పుకున్నాడు

    By Srikanya
    |

    హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ సినిమాకి వెళ్లామంటే అందులో పవన్ కళ్యాణ్ పూర్తిగా ఉండాల్సిందే. ప్రతీ సీన్ లోనూ ఆయన కనపడి ఆయన ఎంటర్టైన్ చేయాల్సిందే. ఇది అభిమానుల మాట. మరి గోపాల గోపాల వంటి ప్రాజెక్టులలో అది సాధ్యమా అంటే కాదనే చెప్పాలి. వెంకటేష్ హీరోగా చేస్తున్న సినిమాలో ఆయన పాత్ర కేవలం 25 నిముషాలేట. అయితే ఇప్పుడు అభిమానులు నిరాశపడతారని దాని నిడివి పెంచినట్లు సమాచారం. ఆ పాత్ర ఇప్పుడు సెకండాఫ్ లో దాదాపు పూర్తిగా ఉంటుంది. కీలకమైన సన్నివేశాల్లో దాదాపు 45 నిముషాల సేపు కనపిస్తాడట. ఇరవై నిముషాల సేపు ఆయన పాత్ర నిడివి పెంచారని సమాచారం.

    ఇక పవన్‌కల్యాణ్‌ 'గోపాల గోపాల'లో మోడ్రన్‌ శ్రీకృష్ణుడి పాత్రని పోషిస్తున్నారు. ఆ పాత్రలో పవన్‌ పలికే సంభాషణలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని సమాచారం. పవన్‌ అభిమానుల్ని మరింతగా సంతోషపెట్టాలన్న ప్రయత్నంలో భాగంగా పాత్రని మరికొంచెం పెంచాలని చిత్రబృందం భావించిందట. అయితే పవన్‌ ఆ ప్రయత్నాన్ని మొదట్లో తిరస్కరించినట్టు సమాచారం. కథని ఉన్నదున్నట్టు తీస్తేనే మేలని... పాత్రని ఏమాత్రం కదపనీయలేదట. కానీ ఇప్పుుడ మార్చిన స్క్రిప్టు విని బాగుందని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.

    Pawan Kalyan's role in 'Gopala Gopala' has been extended

    వెంకటేష్‌, పవన్‌కల్యాణ్‌ జోడీ చాలా బాగుందనీ... వారిద్దరూ ప్రేక్షకులకు సరికొత్త వినోదాలు పంచబోతున్నారని చిత్రబృందం చెబుతోంది. డాలీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.

    ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ నానక్రాంగూడాలో వేసిన ఓ సెట్లో జరుగుతోంది. త్వరలో మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నాడు. కిషోర్ పార్ధసాని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సురేష్ బాబు, శరత్ మరార్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో మధు శాలిని, దీక్ష పంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

    హిందీలో విజయవంతమైన 'ఓ మై గాడ్‌' చిత్రానికిది రీమేక్‌. పవన్‌ కల్యాణ్‌ మోడరన్‌ కృష్ణుడు పాత్రలో కనిపిస్తాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో చిత్ర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

    దర్శకుడు మాట్లాడుతూ... ''భూకంపం కారణంగా తనకు జరిగిన అన్యాయానికి ప్రకృతే కారణమని నష్టపరిహారం ఇవ్వడానికి బీమా సంస్థ నిరాకరిస్తుంది. ఆ సమయంలో ఆ వ్యక్తి ఏం చేశాడనే అంశం ఆధారంగా చిత్రం రూపొందుతోంది. పవన్‌ కల్యాణ్‌, వెంకటేష్‌ కలయికలో చిత్రీకరించిన సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. స్వామీజీగా మిథున్‌ చక్రవర్తి నటన చిత్రానికి ప్రధానాకర్షణగా నిలుస్తుంది'' అంటున్నారు.

    సంక్రాంతికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. చిత్రంలో కృష్ణుడు, మధుశాలిని, వెన్నెల కిషోర్‌, దీక్షా పంత్‌ తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఛాయాగ్రహణం: జయనన్‌ విన్సెంట్‌, కూర్పు: గౌతంరాజు


    English summary
    Pawan Kalyan's role in 'Gopala Gopala' has been extended to 45 minutes. This is almost double the screen time allotted to Lord Krishna's role by the bound script got ready.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X