రికార్డు క్రియోట్ చేయనున్న పవన్ కళ్యాణ్ "తీన్ మార్" సాంగ్
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం తీన్ మార్ లో కేవలం ఒక పాట కోసమే కోటి రూపాయలు సెట్ వేయటం పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. లవ్ ఆజ్ కల్ రీమేక్ గా రూపొందుతున్నఈ చిత్రం ఫుల్ లెంగ్త్ లవ్ స్టోరీ కావటంతో ఖుషీ రేంజిలో ఆడుతుందని ఎక్సపెక్ట్ చేస్తున్నారు. అందులోనూ పులి పూర్తి డిజాస్టర్ చిత్రం కావటంతో ఈ చిత్రం విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.
త్రిష హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని జయంత్ డైరక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రం ఆడియో మార్చి మొదటి వారంలో భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. హాస్య నటుడు గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రాంతానికి చెందిన స్టూడెంట్ గా కనిపంచనున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అలాగే ఈ పాట పూర్తిగా ఇంగ్లీష్ లో సాగనుంది.


Click it and Unblock the Notifications











