twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్ : రోజులు పెంచినా...రేటు పెంచలేదు

    By Srikanya
    |

    హైదరాబాద్ :వెంకటేష్‌, పవన్‌ కల్యాణ్‌ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం 'గోపాల గోపాల'. వెంకటేష్‌ సరసన శ్రియ నటిస్తోంది. కిషోర్‌ పార్థసాని (డాలి) దర్శకుడు. నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌, సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. డి.సురేష్‌బాబు, శరత్‌మరార్‌ నిర్మాతలు. ఈ చిత్రం నిమిత్తం పవన్ కళ్యాణ్ 22 రోజులు పాటు డేట్స్ ఇచ్చినట్లు సమాచారం. అందు నిమిత్తం 15 కోట్లు రెమ్యునేషన్ గా పొందుతున్నారని తెలుస్తోంది.

    మొదట్లో 15 రోజులుకు 15 కోట్లు అని చెప్పి ఒప్పించినట్లు తెలుస్తోంది. అయితే తర్వాత రోజులు మరిన్ని పెరగాయని నిర్మాత సురేష్ బాబు రిక్వెస్ట్ చేయటంతో అదే రెమ్యునేషన్ కి 22 రోజులుకు చేయటానికి ఓకే చేసినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. అయితే పవన్ కనిపించేది తెరపై 25 నిముషాలు పాటు అని...ఇంటర్వెల్ దగ్గర పవన్ రివిల్ అవుతాడని అంటున్నారు. ఆ కాస్సేపు కనిపించినా పవన్ క్రేజ్ తో ఓపినింగ్స్ , రికార్డు కలెక్షన్స్ కలెక్టు అవుతాయని భావిస్తున్నారు.

    Pawan Kalyan’s Rs 15 crore for 22 days

    ఈ చిత్రం హిందీలో విజయవంతమైన 'ఓమైగాడ్‌'కిది రీమేక్‌. సినిమా షూటింగ్ హైదరాబాద్‌ శివార్లలో జరుగుతోంది. ప్రత్యేకంగా రూపొందించిన గృహ సముదాయం సెట్‌లో వెంకటేష్‌, పవన్‌ కల్యాణ్‌, శ్రియ తదితర ముఖ్య పాత్రధారులపై టాకీ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

    నిర్మాత మాట్లాడుతూ..''తనకు జరిగిన నష్టానికి దేవుడి పైనే కేసు వేసిన ఓ వ్యక్తి కథ ఇది. అసలు ఆ వ్యక్తి ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందనే నాటకీయ పరిణామాలు ఆసక్తికరంగా ఉంటాయి. దర్శకుడు చిత్రాన్ని ఆసక్తికరంగా మలుస్తున్నాడు'' అంటున్నారు. చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ స్వరాలందిస్తున్నారు.

    English summary
    A request from producer D. Suresh Babu, who asked Pawan Kalyan for a commitment of 22 days, the actor relented. So now, the sum stands at Rs 15 crore for just 22 days of work.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X