రంగంలోకి పవన్ వారసుడు.. రామ్ చరణ్ చేతిలో అకీరా నందన్ బాధ్యతలు
Recommended Video
మెగా ఫ్యామిలీ నుంచి మరో యువ కెరటం సినీ రంగంలోకి రానుందని తెలుస్తోంది. ఇందుకోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారని సమాచారం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా నందన్ వెండితెర ప్రయాణానికి ముహూర్తం ఫిక్స్ చేసే పనిలో ఉందట మెగా ఫ్యామిలీ. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అయ్యారు కాబట్టి ఆయన సినీ వారసత్వాన్ని అకీరాతో ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నాలు జరుగుతున్నాయట.

పవన్ సినిమా లేని లోటు స్పష్టం
టాలీవుడ్ హీరోల్లో కెల్లా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజే వేరు. చేసింది కొన్ని సినిమాలే అయినా అన్నయ్యకు తగిన తమ్ముడిగా మెగా అభిమాన లోకాన్ని బాగా అలరించారు పవన్. కానీ ఇటీవలే ఆయన రాజకీయ గడప తొక్కడం, గత ఎన్నికల్లో పోటీ చేయడం కారణంగా సినిమాలకు దూరమయ్యారు. దీంతో టాలీవుడ్ చిత్రసీమలో పవన్ సినిమాలు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు జనం.

పొలిటికల్ బిజీ.. అందరి కళ్ళు ఆయనపైనే
సమాజంలోని అవినీతిని వెలికి తీయాలనే లక్ష్యంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన పవన్.. ఆయా కార్యక్రమాలతో బిజీ బిజీ అయ్యారు. అడపాదడపా ఆయన సినీ ఎంట్రీ గురించి వార్తలొస్తున్నప్పటికీ అది జరిగే పని కాదని తెలుస్తోంది. పవన్ కూడా ఈ విషయమై ఇప్పటిదాకా స్పందించలేదు. మరోవైపు పవన్ కుమారుడు అకీరా నందన్ పెద్దవాడయ్యాడు. హీరోలా కనిపిస్తున్నాడు. దీంతో ఇప్పుడు అందరి కళ్ళు అకీరాపై పడ్డాయి.

పవన్ ప్లాన్ కూడా అదే!
అకీరా నందన్ సినీ ఎంట్రీపై పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది. తాను రాజకీయాల్లో బిజీగా ఉంటూ తనయుడిని సినిమా ఇండస్ట్రీలో బిజీ చేయాలని ఆయన సన్నాహాలు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇందుకోసం రామ్ చరణ్‌కి తమ్ముడి బాధ్యతలు అప్పగించారని ఫిలిం నగర్ టాక్.

చెర్రీ నిర్మాణంలో అకీరా..?
పవన్ వారసుడు, తన తమ్ముడు అకీరా నందన్.. టాలీవుడ్ ఎంట్రీ కోసం రామ్ చరణ్ కూడా కొన్ని ప్లాన్లలో ఉన్నారని తెలుస్తోంది. తన సొంత బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీలోనే అకీరా తొలి సినిమాను నిర్మించాలని చెర్రీ స్కెచ్ వేస్తున్నారట. ఇదే జరిగితే మెగా అభిమానులకు పండగే మరి. చూడాలి ప్రస్తుతం పెద్ద ఎత్తున వస్తున్న ఈ వార్తలు ఎంతవరకు నిజమవుతాయనేది.

అకీరా నందన్ పిక్స్ వైరల్
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అకీరా నందన్ పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఆరడుగుల హైట్‌తో ఆకర్షణీయమైన లుక్ లో కనిపిస్తున్నాడు ఈ జూనియర్ పవర్ స్టార్. దీంతో అకీరా నందన్ లో ఓ హీరోకి ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. ఇప్పటికే అకీరా ఓ మరాఠీ సినిమాలో కూడా నటించాడు. సో ఇలా చూస్తే ఆయన టాలీవుడ్ సినీ ప్రయాణానికి ముహూర్తం దగ్గరపడినట్లే అనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











