పవన్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్: ‘వకీల్ సాబ్’ టీజర్‌కు డేట్ ఫిక్స్
సుదీర్ఘ విరామం తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఎవరైనా హీరో కమ్‌బ్యాక్ మూవీ కోసం పక్కా ఎలివేషన్స్ ఉండే కథను ఎంచుకుంటాడు. కానీ, ఈయన మాత్రం బాలీవుడ్‌లో బంపర్ హిట్ అయిన 'పింక్' సినిమాను రీమేక్ చేస్తున్నాడు. 'వకీల్ సాబ్' అనే టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాను వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్నాడు. దీనికి బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో నివేదా థామస్, అంజలి, అనన్య హీరోయిన్లగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.
'వకీల్ సాబ్' మూవీలో వ్యభిచార గృహాల్లో చిక్కుకున్న అమ్మాయిలను రక్షించే లాయర్‌లా నటిస్తున్నాడు పవన్ కల్యాణ్. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా, కరోనా వైరస్ ప్రభావంతో వాయిదా పడింది. దీంతో సినిమాకు సంబంధించిన టీజర్ కూడా రిలీజ్ అవలేదు. నిజానికి పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా గత సెప్టెంబర్ 2నే దీన్ని వదులుతారని అనుకున్నా.. అలా జరగలేదు. దీనిపై మెగా ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పవన్ సినిమా టీజర్‌కు చిత్ర యూనిట్ ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.

తాజా సమాచారం ప్రకారం.. 'వకీల్ సాబ్' టీజర్‌ను నూతన సంవత్సర కానుకగా డిసెంబర్ 31న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుందట. ఇప్పటికే దీనికి సంబంధించిన కట్ కూడా అయిపోయిందని అంటున్నారు. అలాగే, థమన్ కూడా బ్యాగ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేసి ఇచ్చేశాడట. దీంతో ఈ సారి టీజర్ రావడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. ఇక, ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, మగువా మగువా సాంగ్స్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. వీటి వల్ల సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయనే చెప్పాలి.


Click it and Unblock the Notifications











