పోలీస్ స్టేషన్లో పవన్ కళ్యాణ్ భార్య రేణు దేశాయ్ కేసు...
పవన్ కళ్యాణ్ భార్య రేణు దేశాయ్..బంజారా హిల్స్ లోని ఓ బేబీ కేర్ సెంటర్ పై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసే ప్రయత్నం చేసారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. రేణు దేశాయ్ ఓ పోగ్రాం కి అటెండ్ కావటానికి వారి మూడు నెలల పాపని బేబీ కేర్ సెంటర్ లో అప్పచెప్పింది. అయితే కాస్సేపటికి ఆమెకు బేబీ కేర్ సెంటర్ నుంచి ఫోన్ వచ్చింది. ఆ పాప క్రిందపడి దెబ్బలు తగిలాయని. అక్కడున్న ఆయా చేతుల నుంచి జారి పాపకు చిన్న దెబ్బలు తగిలాయి. దాంతో కోపంతో మండిపడుతూ వచ్చిన ఆమె వారిని చెడా మడా దులిపేసారు. అంతేగాక పాపను తీసుకుని వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంయింట్ ఇవ్వబోయారు. అయితే దెబ్బలు చాలా చిన్నవని, కావాలని జరగలేదని,పొరపాటున చెయ్యజారిందని ఆమెకు ఆ కేర్ సెంటర్ వాళ్ళు బ్రతిమాలి వివరించే ప్రయత్నం చేసారని వినికిడి.దాంతో శాంతించిన ఆమె వార్నింగ్ ఇచ్చి వదిలేసిందని దాంతో వారు ఊపిరి పీల్చుకున్నారని సమాచారం. ఇక మాతృప్రేమతో ఆమె స్పందించి తీరు అది అని, స్వతహాగా ఆమె చాలా శాంతంగా ఉంటుందని ఆమె గురించి తెలుసున్న వారు చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











