పవన్ - రేణు దేశాయ్‌పై ఇంట్రస్టింగ్ రూమర్?
కాగా...తాజాగా ఫిల్మ్ నగర్లో ఈ దంపతులపై ఓ ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. రేణు దేశాయ్ నిర్మాతగా మారారని, మరాఠీలో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారని, ఆ సినిమా కథ పవన్-రేణు దేశాయ్ నిజ జీవితంలో చోటు చేసుకున్న పలు సంఘటలను పోలి ఉంటుందని అంటున్నారు. మరి ఇందులో నిజం ఎంతో తేలాల్సి ఉంది.
'బద్రి' చిత్రంలో కలిసి నటించిన సమయంలో పవన్-రేణు మధ్య ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారిన సంగతి తెలిసిందే. కొంతకాలం సహజీవనం చేసిన ఈ జంట, ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నారు. వీరికి కుమారుడు అకీరా నందన్, కూతురు ఆద్యా ఉన్నారు.
పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికొస్తే...ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'అత్తారింటికి దారేది'(వర్కింగ్ టైటిల్) చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈచిత్రం షూటింగ్ యూరఫ్ లో జరుగుతోంది. ఇందులో సమంత, ప్రణీత హీరోయిన్లు. బివిఎస్ఎన్ ప్రసాద్, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications












