Pawan Kalyan: పవర్ఫుల్ డాన్ పాత్రలో పవర్ స్టార్.. ఆ దర్శకుడితో యాక్షన్ ప్లాన్?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలను లైన్లో పెడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇంతకుముందు ఓకే అయిన కొన్ని ప్రాజెక్టులు మొదలవుతాయా లేదా అనే అనుమానాలు కూడా చాలానే వస్తున్నాయి. ముఖ్యంగా హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేసేందుకు ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కూడా ప్రొడ్యూస్ చేయడానికి రెడీ అయింది. భావాడియుడు భగత్ సింగ్ అనే టైటిల్ కూడా అనుకున్నారు.

అయితే ఆ ప్రాజెక్టు ఇంకా మొదలు కాలేదు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ మరిన్ని కథలకు ఓకే చేస్తున్నాడు. రీసెంట్ గా సాహో డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి పవన్ ఆసక్తిని చూపించినట్లుగా తెలుస్తోంది. అందులో అతను ఒక పవర్ఫుల్ డాన్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇదివరకే దర్శకుడు సుజిత్ పవన్ కళ్యాణ్ కు ఒక కథను చెప్పినట్లు అనేక రకాల కథనాలు వెలువడ్డాయి.

Pawan kalyan saaho director planing a big action project latest news

అయితే ఇప్పుడు మళ్లీ మరో కథ గురించి చెప్పడంతో పవన్ సంతృప్తి చెందినట్లు సమాచారం. మరోసారి ఫుల్ స్క్రిప్ట్ సిద్ధమైన తర్వాత మాట్లాడదామని కూడా భరోసా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్టు ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు అనే విషయంలో కొంత కన్ఫ్యూజన్ నెలకొంది. ఎందుకంటే మొదట RRR నిర్మాత డివివి ప్రొడక్షన్ లోనే ఈ సినిమా ఉంటుంది అని అనుకున్నారు.

దానయ్య కూడా సాహో డైరెక్టర్ కి అడ్వాన్స్ ఇచ్చినట్లు టాక్ వచ్చింది. కానీ సోషల్ మీడియాలో సుజిత్ పవన్ కళ్యాణ్ కు సంబంధించిన కాంబినేషన్స్ వైరల్ అవుతుండడంతో ఆ సినిమాను డివివి వారు నిర్మించబోతున్నారు అని కథనాలు కూడా వచ్చాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై త్వరలోనే క్లారిటీ ఇస్తాము అని కూడా ఈ నిర్మాణ సంస్థ క్లారిటీ అయితే ఇచ్చింది. మరోవైపు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాను మొదట ఫినిష్ చేసి ఆ తర్వాత వినోదాయ సీతమ్ ను రీమేక్ చేయాలని అనుకుంటున్నాడు. ఆ సినిమాలో సాయిధరమ్ తేజ్ మరో హీరోగా కనిపించబోతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X