ఏంటీ.. 'బ్రో' ఫస్ట్ ఛాయిస్ పవన్ కాదా... ఆ స్టార్ హీరోనా? రిజెక్ట్ చేసి బతికించేశాడు బ్రో!
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్సంతా పవన్ కల్యాణ్ మేనియాతో కళకళలాడుతున్నాయి. అయితే ఈ సినిమా పవన్ ఫ్యాన్స్‌కు బాగా ఆకట్టుకున్నప్పటికీ.. కొన్ని చోట్ల మాత్రం డివైట్ టాక్ తెచ్చుకుంది. అయితే అసలీ సినిమా ఫస్ట్ ఛాయిస్ పవన్ కాదంట. మరో తెలుగు స్టార్ హీరో చేయాల్సిందట. ఇంతకీ అతనెవరంటే?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబోలో వచ్చిన సినిమా 'బ్రో'. సముద్రఖని తెరకెక్కించిన ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు అందించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మించింది. కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటించారు. తమన్ సంగీతాన్ని అందించారు. తమిళలంలో సూపర్ హిట్‌గా నిలిచిన 'వినోదయ సీతమ్'కు రీమేక్‌గా తెరకెక్కింది.

భారీ రిలీజ్.. థియేటర్లు ఫుల్: ఈ 'బ్రో' తాజాగా సినీ ప్రేక్షకుల ముందుకు గ్రాండ్‌గా వచ్చింది. వరల్డ్ వైడ్‌గా దాదాపు 1500లకు పైగా థియేటరల్లో రిలీజ్ చేశారట. అయితే మిగతా చోట్ల సంగతి పెక్కనపెడితే.. ఏపీ, తెలంగాణలోని థియేటర్లంతా అభిమానులతో కళకళలాడాయి. ఫ్యాన్ ఈలులు గోలలతో పండగ చేసుకుంటున్నారు.

ఫస్ట్ డే కలెక్షన్స్: ఇక ఈ చిత్రం మొదటి రోజు రూ. 30.01 కోట్లు షేర్, రూ. 48.50 కోట్లు గ్రాస్ వసూళ్లను తన ఖాతాలో వేసుకున్నట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. నిజానికి వర్షాల కారణంగా మొదటి రోజు ఈ చిత్రం రూ.20 నుంచి రూ.22 కోట్ల మధ్య కలెక్షన్లను అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. కానీ ఆ అంచనాలను తలకిందులు చేసింది.

ఆయనే ఫస్ట్ ఛాయిస్: అయితే ఈ సినిమా ఇంతటి కలెక్షన్లను సాధించినప్పటికీ.. ఈ చిత్రం కేవలం పవన్ ఫ్యాన్స్‌కు మాత్రమే అన్న టాక్ వినిపిస్తోంది. ఇకపోతే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా మొదటి ఛాయిస్ పవన్ కాదని తెలిసింది. దర్శకుడు సముద్రఖని ముందుగా అనుకున్న హీరో ప్రభాస్ అని తెలిసింది. సాయి తేజ్ పాత్రలో అఖిల్‌ను అనుకున్నారట. కానీ ప్రభాస్ కథ వినకుండానే రిజెక్ట్ చేశారట. మరి ఇందులో నిజమెంతో తెలియదుగానీ ఇదే ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.

ఇంకా ఎవరితోనంటే: ఆ తర్వాత పవన్ పాత్ర కోసం కోలీవుడ్ స్టార్ హీరో సూర్య - కార్తీక్ లను కూడా సముద్రఖని అనుకున్నారట . వాళ్లు కూడా రిజెక్ట్ చేశారట. ఇక చివరిగా ఈ కథ వచ్చి పవన్ కల్యాణ్ - వరుణ్ తేజ్ వద్దకు వచ్చిందట. కానీ పవన్ సూచన మేరకు..సాయితేజ్ అయితే బాగుంటాడు అని అతడిని తీసుకున్నారట. ఇక ఈ వార్త తెలుసుకుంటున్న ప్రభాస్ అభిమానులు.. డార్లింగ్ మంచి పని చేశారని అంటున్నారు. లేదంటే ప్రభాస్ ఖాతాలో మరో ఫ్లాప్ పడేదని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











