పవన్ కళ్యాణ్ నో చెప్పారు, మరి చిరంజీవి ఒప్పుకుంటారా?

పవన్ కళ్యాణ్ సినిమాలో నటించబోతున్నట్లు ఇటీవల వార్తలు హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే వెంటనే జనసేన అధినేత దీనిపై క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తాను సినిమాలపై దృష్టి పెట్టడం లేదని, తన జీవితం ప్రజా సేవకే అంకింతం, నేను సినిమా చేయబోతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు అని పవర్ స్టార్ స్పష్టం చేశారు.

ఈ వార్తలు తెరపైకి రావడానికి కారణం సాయి ధరమ్ తేజ్ మూవీ. గతంలో పవర్ స్టార్‌తో 'గోపాల గోపాల', 'కాటమరాయుడు' సినిమాలు తెరకెక్కించిన కిషోర్ పార్దసాని(డాలీ) మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కోసం ఓ కథను సిద్ధం చేశారు. ఇందులో పవర్ స్టార్ కోసం 30 నిమిషాల నిడివి ఉండే ప్రత్యేకమైన పాత్రను రాసుకున్నారు.

సాయి ధరమ్ తేజ్‌ను నిలబెట్టేందుకు పవన్ వస్తాడని...

సాయి ధరమ్ తేజ్‌ను నిలబెట్టేందుకు పవన్ వస్తాడని...

చాలా రోజులుగా సాయి ధరమ్ సరైన హిట్ లేక స్ట్రగుల్ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో ఇందులో తాను రాసుకున్న కథలో పవర్ స్టార్ పాత్ర ఉంటే హిట్ ఖాయం అని డాలీ భావించారు. ఈ విషయాన్ని సాయి ధరమ్‌కు చెప్పడం, మామయ్యను నేను ఒప్పిస్తానని అతడు మాటివ్వడం జరిగిందట.

రాజకీయ పరిణామాలు మరోలా...

రాజకీయ పరిణామాలు మరోలా...

అయితే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో తాను సినిమాల వైపు వస్తే పరిస్థితి మరోలా ఉంటుందని భావించిన పవన్ కళ్యాణ్..... డాలీ సినిమాలో గెస్ట్ రోల్ చేయడానికి ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. అయితే అప్పటికే వార్తలు స్ప్రెడ్ అవ్వడంతో జనసేన అధినేత అఫీషియల్ ప్రెస్ నోట్ ద్వారా ఖండించక తప్పలేదు.

చిరంజీవిని సంప్రదిస్తారా?

చిరంజీవిని సంప్రదిస్తారా?

అయితే పవర్ స్టార్ చేయడానికి నో చెప్పారు కాబట్టి.... చిరంజీవిని ఆశ్రయించాలని డాలీ భావిస్తున్నారట. అయితే ఇది ఎంత మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. త్వరలోనే ఈ విషయమై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్

‘నేను త్వరలో ఒక సినిమా చేయబోతున్నట్లు కొన్ని మాధ్యమాల్లో వచ్చిన వార్తలు నిజం కాదు. ఏ చిత్రంలోనూ నటించేందుకు అంగీకారం తెలుపలేదు. సినిమాలో నటించేందుకు అవసరమైన సమయం లేదు. ప్రజా జీవితానికే పూర్తతి సమయం కేటాయించాను. ప్రజల్లోనే ఉంటూ, జనసైనికులు, అభిమానులతో కలిసి పాలకుల తప్పిదాలను బలంగా వినిపిస్తున్న తరుణమిది. సినిమాలపై దృష్టి సారించడం లేదు. నా ఆలోచనలు అన్నీ ప్రజా క్షేమం కోసమే. నా తపన అంతా సమసమాజ స్థాపన కోసమే.'' అని పవన్ కళ్యాణ్ ఇటీవల తన అఫీషియల్ స్టేట్మెంటులో స్పష్టం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X