పవన్ కళ్యాణ్ ను ఆ రకంగా భయపెడుతున్న ‘పంజా’..!?
పంజా .. పంజా .. పంజా .. పంజా .. పంజా .. పంజా .. గెడ్డం లుక్ లోనే అభిమానులకు బాగా అలవాటు అయిపోయాడు. పంజా ట్రైలర్స్ , స్టిల్స్ రోజుకు ఎన్ని సార్లు చూస్తున్నామో లెక్క లేకుండా పోయింది. పవన్ కళ్యాణ్ 'పంజా" పాటలు ఈ నెల 19న గచ్చిబౌలిస్టేడియంలో విడుదల కానున్నాయి. పవర్ స్టార్ సినిమా ఆడియోకున్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. పాటల విడుదల కూడా సినిమా విడుదల అంత హడావిడి చేయడం మెగా అభిమానులకు పరిపాటే. ఆ రకంగా ఈ నెల 19 వారికి నిజంగా స్పెషల్!
పైగా తొలిసారి పవర్ స్టార్ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే వండర్ అనిపించేంత హిట్ బాణీలను 'యువన్" అందించారని సమాచారం.'ఇప్పటివరకూ వచ్చిన పవన్‌కళ్యాణ్ సినిమాలకు పూర్తి భిన్నంగా, చాలా స్టయిలిష్ గా ఈ చిత్రం రూపొందుతోంది.
అయితే తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి చిత్రాలతో లేడీస్ నే కాకుండా కాలేజ్ గర్ల్స్ ని కూడా ఎట్రాక్ట్ చేసిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత గుడుంబా శంకర్, బంగారం, కొమరం పులి, చిత్రాలతో ఫీమేల్ ఆడియన్స్ ని పూర్తిగా దూరం చేసుకున్నాడు. ఈ మధ్య వచ్చిన తీన్ మార్ కూడా వారిని ఎట్రాక్ట్ చెయ్యలేకపోయింది. లేటెస్ట్ గా తమిళ డైరెక్టర్ విష్ణువర్థన్ డైరెక్షన్ లో స్టైలిష్ మూవీగా తెరకెక్కుతున్న 'పంజా" విషయంలో కూడా అదే జరిగేలా ఉందని సినీఅభిమానుల్లో టాక్.
ఈ టైటిల్ ని ఫీమేల్ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసేదిగా లేకపోవడంతో ఒక కారణమైతే, ప్రతి సినిమాలో క్లీన్ షేవ్ తో కనిపించే పవన్ 'పంజా"లో మాత్రం గడ్డంతో డీగ్లామర్ గా కనిపిస్తున్నాడు. దీంతో ఈ సినిమా చూసేందుకు లేడీస్ థియేటర్స్ కి వస్తారా అనే టెన్షన్ లో పడ్డాడట పవన్ కళ్యాణ్. డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'పంజా" ఏ టైప్ ఆఫ్ ఆడియెన్స్ ని టార్గెట్ చేస్తుందో, ఏమేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే...


Click it and Unblock the Notifications











