For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఫ్యాన్స్‌కు గుండెలు పిండేసే న్యూస్: ‘వకీల్ సాబ్’లో పవన్ కనిపించేది అంతసేపే.. ఆయన లేకుండానే ఆ సీన్లు

  |

  కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మన వాళ్లు ఉన్న అన్ని ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది. దీనికి కారణం 'వకీల్ సాబ్' మూవీ రిలీజ్ అన్న విషయం అందరికీ తెలుసు. అదేనండీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా దాదాపు మూడేళ్ల తర్వాత విడుదల కాబోతుంది. అందుకే ఆయన రీఎంట్రీ మూవీ కోసం ఫ్యాన్స్ అదిరిపోయే ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం సాయంత్రం నుంచి చాలా ప్రాంతాల్లో స్పెషల్ షోలు కూడా పడబోతున్నాయి. ఇలాంటి సమయంలో అభిమానుల గుండెల్ని పిండేసే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం!

  లాంగ్ గ్యాప్ తర్వాత ‘వకీల్ సాబ్’గా మారాడు

  లాంగ్ గ్యాప్ తర్వాత ‘వకీల్ సాబ్’గా మారాడు

  సుదీర్ఘ విరామం తర్వాత సినిమాల్లోకి వస్తున్నాడు పవన్ కల్యాణ్. ఇందుకోసం ‘వకీల్ సాబ్' మూవీని ఎంచుకున్నాడు. వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ సినిమాను బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మించాడు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించాడు. ఎన్నో అంచనాల నడుమ ఈ చిత్రం ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

  ఆ ముగ్గురి కథతో వస్తోంది.. పవన్ పోరాటంతో

  ఆ ముగ్గురి కథతో వస్తోంది.. పవన్ పోరాటంతో

  ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేని ముగ్గురు సామాన్య యువతులకు అనుకోని విధంగా ఓ కష్టం వస్తుంది. ఇందులో భాగంగానే వాళ్లంతా ఓ కేసులో ఇరుక్కుంటారు. వాళ్లకు ప్రతికూలంగా మారుతోన్న టైమ్‌లో లాయరైన హీరో ఎంట్రీ ఇస్తాడు. అప్పటి నుంచి బాధిత యువతలను కాపాడేందుకు పోరాటం చేస్తాడు. ఇదే వకీల్ సాబ్ కథ. అంజలి, నివేదా థామస్, అనన్య ఆ మూడు పాత్రలను చేశారు.

  రెండు భాషల కంటే భిన్నంగా... హైలైట్ చేస్తూ

  రెండు భాషల కంటే భిన్నంగా... హైలైట్ చేస్తూ

  ‘వకీల్ సాబ్' ప్రకటించినప్పటి నుంచే దీనిపై ఆసక్తి ఏర్పడింది. రెండు భాషల్లో లేని విధంగా ఇందులో పవన్ కల్యాణ్‌ పాత్రను ఎలివేట్ చేస్తున్నారని తెలిసినప్పటి నుంచి అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే మోషన్ పోస్టర్, టీజర్‌, ఆ తర్వాత వచ్చిన సినిమాలోని పాటలతో అవన్నీ రెట్టింపయ్యాయి. ఇక, ఇటీవల విడుదలైన ట్రైలర్ అంచనాలు అమాంతం పెంచింది.

  పండుగ వాతావరణం.. బిజినెస్.. రిలీజ్ గ్రాండ్

  పండుగ వాతావరణం.. బిజినెస్.. రిలీజ్ గ్రాండ్

  లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కల్యాణ్ నటించిన సినిమా కావడంతో ‘వకీల్ సాబ్'పై భారీ బజ్ ఏర్పడింది. దీని కోసం మెగా అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకనుగుణంగానే డిస్ట్రిబ్యూటర్లు కూడా భారీ మొత్తం పెట్టి దీన్ని కొనుగోలు చేశారు. దీంతో అన్ని ఏరియాల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఆ ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.

  పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుండెలు పిండేసే న్యూస్

  పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుండెలు పిండేసే న్యూస్

  గురువారం సాయంత్రం యూఎస్‌లో ‘వకీల్ సాబ్' ప్రీమియర్ షోలు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చాలా ప్రాంతాల్లో స్పెషల్ షోలు పడనున్నాయి. ఇందుకోసం ఎప్పటి నుంచో ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. దీంతో రెండు రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్ మేనియా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన అభిమానుల గుండెల్ని పిండేసే ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

  Pawan Kalyan Reaction After Watching Vakeel Saab
  ‘వకీల్ సాబ్’లో పవన్ కనిపించేది అంతసేపే

  ‘వకీల్ సాబ్’లో పవన్ కనిపించేది అంతసేపే

  తాజా సమాచారం ప్రకారం.. ‘వకీల్ సాబ్' మూవీ రన్‌టైమ్ 154 నిమిషాలు ఉంటుందట. అందులో పవన్ కల్యాణ్ కేవలం 50 నిమిషాలు మాత్రమే కనిపిస్తాడని తెలిసింది. మిగిలిన సమయం మొత్తం ముగ్గురు అమ్మాయిల చుట్టూనే కథ తిరుగుతుందట. ఇందులో ఇంట్రడక్షన్ సీన్, ఫ్లాష్ బ్యాక్ సీన్స్, కోర్టు సన్నివేశాల్లో మాత్రమే పవన్ ఉంటాడని.. మిగిలిన భాగంలో కనిపించడని సమాచారం.

  English summary
  Pawan Kalyan is actor who showing more impact over young star with his positive attitude. Within shot gap he turned into major icon of all Telugu people. In Few Days Pawan Kalyan Re entry To Tollywood.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X