ఆ సినిమా కోసం మళ్ళీ రైటర్ గా మారిన పవన్.. త్రివిక్రమ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో..
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలు మల్టీ టాలెంటెడ్ అని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కేవలం నటించడమే కాకుండా డైరెక్షన్, సింగింగ్.. ఇంకా రైటింగ్ తో కూడా మెప్పిస్తుంటారు. ఇక సొంతంగా వారి స్టైల్ కు తగ్గట్లు కథలను స్క్రీన్ ప్లేను రాసుకునే హీరోలు కూడా ఉన్నారు. అలాంటి వారిలో పవన్ కళ్యాణ్ ఒకరు. చాలా వరకు పవన్ కళ్యాణ్ ఎలాంటి సినిమా చేసినా డిఫరెంట్ గా ఉంటుంది.
కమర్షియల్ పాయింట్స్ ఎంత ఉన్నా కూడా పవన్ తన పాత్రను దర్శకుడికి నచ్చే విధంగా విభిన్నంగా ప్రజెంట్ చేసుకుంటాడు. ఇక సినిమాకు తనకు నచ్చిన పాయింట్స్ ను కూడా చెబుతూ ఉంటాడు. అసలు మ్యాటర్ లోకి వస్తే పవన్ కళ్యాణ్ చాలా రోజుల తరువాత మళ్ళీ తన రైటింగ్ స్కిల్స్ ను బయటపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ లో రానా, పవన్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న విషయం తెలిసిందే.

సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వ పర్యవేక్షకుడిగా ఉన్నాడు. ఇక పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్లేను విషయంలో తన పెన్ను పవర్ ను ఉపయోగించినట్లు సమాచారం. త్రివిక్రమ్ కూడా వాటిని యాక్సెప్ట్ చేయడంతో దర్శకుడు సాగర్ చంద్ర తనదైన శైలిలో తెరకెక్కించడానికి ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మరి పవన్ పేరును టైటిల్ కార్డ్ లో వేస్తారో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











