170 కోట్ల రెమ్యునరేషన్‌తో పవన్ కల్యాణ్.. పవర్ స్టార్ చివరి సినిమా అదేనా?
పాన్ ఇండియా మార్కెట్ లో చాలా మంది స్టార్ హీరోస్ ఉండొచ్చు కానీ రీజనల్ కింగ్స్ మాత్రం కొందరే అని చెప్పాలి. మెయిన్ గా మన తెలుగు రాష్ట్రాల్లో కొందరు హీరోల క్రేజ్ అండ్ మార్కెట్ అని అనన్య సామాన్యం. మరి అలాంటి క్రేజ్ ఉన్న హీరోస్ లో ఒకరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
కాగా ఇపుడు పవన్ కళ్యాణ్ కి ఉన్న బిజీ షెడ్యూల్ లైఫ్ లో తన డేట్ ఒక సినిమాకి దక్కింది అంటేనే అది మహా ప్రసాదం అన్నట్టు అయ్యింది ఇపుడు పరిస్థితి. నిజానికి ఇపుడు కంటే తాను పాలిటిక్స్ లో దాదాపు బిజీ అయ్యిపోతున్నారు అనే సమయంలో నిర్మాతలు రోజుకి రెండు నుంచి రెండున్నర కోట్లు కూడా రెమ్యునరేషన్ ఇచ్చేందుకు సిద్ధం అయ్యారు.

ఇలాంటి క్రేజ్ పవన్ సొంతం కాగా ఇపుడు పవన్ చేస్తున్న సినిమాల్లో మూడూ దేనికదే సెపరేట్ హైప్ ని సెట్ చేసుకున్నాయని చెప్పాలి. రెండు భారీ పాన్ ఇండియా చిత్రాలు హరి హర వీరమల్లు దర్శకుడు జ్యోతి కృష్ణతో చేస్తున్న చిత్రం ఒకటి కాగా మరో చిత్రం దీనికి మించి హైప్ ఉన్న భారీ చిత్రం 'ఓజి'.. దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న సినిమా నెక్స్ట్ లెవెల్ హైప్ ని సెట్ చేసుకుంది.
కాగా ఈ సినిమాలు కాకుండా రీజనల్ వరకు ప్లాన్ చేసిన మాస్ చిత్రం దర్శకుడు హరీష్ శంకర్ తో చేస్తున్నది ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఒకటి. ఈ మూడు సినిమాల్లో అభిమానులకి ఫ్రాంక్ గా చెప్పమంటే మొదట ఓజి, తర్వాత హరిహర వీరమల్లు ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల కోసం ఎగ్జైట్ అవుతున్నాం అని చెబుతారు.
సో ఇదే కోవలో రెమ్యునరేషన్ లు పరంగా చూసుకున్నా కూడా ఓజికే ఎక్కువ ఆ తర్వాత వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ లకి ఉండొచ్చు అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి పవన్ కళ్యాణ్ అందుకుంటున్న మొత్తం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే అని టాలీవుడ్ లో వినిపిస్తుంది. కాగా ఈ చిత్రానికి ఏకంగా పవన్ కళ్యాణ్ అక్షరాలా 170 కోట్ల రెమ్యునరేషన్ ని అందుకుంటున్నారట. అది కూడా రీజనల్ గా ఈ మొత్తం ఆల్ టైం రికార్డు అని తెలుస్తుంది. కాగా తెలుగులో ఇప్పుడు వరకు ఈ రేంజ్ లో అందుకున్న హీరో మరొకరు కూడా లేరు. ఓజి సాంగ్ లో పవన్ పై ఎవ్వరికి అందదు అతని రేంజ్ అనే మాట ఇందుకు పర్ఫెక్ట్ అని చెప్పవచ్చు.
నిజానికి ఒక్క రీజనల్ గానే కాకుండా పాన్ ఇండియా కూడా చాలా మంది హీరోస్ కి ఈ రేంజ్ లో పారితోషికం లేదు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఈ చిత్రానికి కూడా ఈ ఏడాదిలోనే డేట్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కాగా ఈ ఏడాది జూలై మధ్య లోనుంచి పవన్ కళ్యాణ్ షూటింగ్ లో పాల్గొననున్నారట.


Click it and Unblock the Notifications











