పవన్ సెంటిమెంట్ నితిన్‌కు కలిసొస్తుందా?
హైదరాబాద్: నితిన్ కొత్త సినిమా గుండెజారి గల్లంతయ్యిందే ఆడియో విడుదల కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు గానీ ఆల్ ద బెస్ట్ అంటూ సందేశాన్ని పంపించాడట. పవన్ కళ్యాణ్ సెంటిమెంటు నితిన్‌కు వర్కవుట్ అవుతోందట. ఇష్క్ సినిమాతో అది రూఢి అయిందని నితిన్ నమ్ముతున్నాడు. నితిన్ బాల్యం నుంచి పవన్ కళ్యాణ్ అభిమాని.
పవన్ కళ్యాణ్‌పై అభిమానంతో, సెంటిమెంట్‌తో నితిన్ 'గబ్బర్ సింగ్' చిత్రంలో ఒక పాటలో వచ్చిన లైన్‌ను తన సినిమా టైటిల్‌గా పెట్టుకున్నాడు. ఇష్క్ చిత్రం ఆడియో ఫంక్షన్‌కి పవన్‌కల్యాణ్ వచ్చి నితిన్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఆ సినిమా బాక్సాఫీసు వద్ద విజయం సాధించింది. నితిన్ కొత్త సినిమా "గుండెజారి గల్లంతైందే" సినిమా ఆడియో ఫంక్షన్‌కు పవర్‌స్టార్ రాలేదు. కానీ ఆల్ ది బెస్ట్ నితిన్ అనే సందేశాన్ని పంపారట. దీనితో నితిన్ ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నాడట.
ఒక్క పవన్ కల్యాణ్ సెంటిమెంటే కాదు ఇష్క్ చిత్రానికి సంగీతం అందించిన అనూప్ రూబెన్ ఈ చిత్రానికి కూడా మ్యూజిక్ డైరెక్టర్‌గా పెట్టుకున్నారు. ఇష్క్ చిత్రంలో నితిన్, నిత్యామీనన్ కెమెస్ట్రీకి మంచి టాక్ వచ్చింది. కొత్త సినిమాలోనూ నిత్య నటించడం ప్లస్ పాయింట్ అవుతుందని నితిన్ భావిస్తున్నాడట.
ఇష్క్ చిత్రం ద్వారా నితిన్ గాయకుడి కూడా మారాడు. అదే సెంటిమెంట్‌తో ఈ సినిమాలో కూడా నితిన్ ఓ పాట పాడారట. మొత్తానికి నితిన్ సెంటిమెంట్లు గుండె జారి గల్లంతయ్యిందే చిత్రానికి ఏ మేరకు వర్కవుట్ అవుతాయో చూడాలి. పైగా, జ్వాలా గుత్తా ఐటం సాంగ్ అదరగొట్టేట్లే ఉంది. నితిన్, జ్వాలా గుత్తా స్టిల్స్ ఇప్పటికే ప్రేక్షకుల గుండెల్లో నాటుకున్నాయి.


Click it and Unblock the Notifications











