పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ కి హితబోధ...
రామ్ చరణ్ కి ఇప్పుడంతా బ్యాడ్ పీరియడ్ నడుస్తున్నట్టుంది. ఒకటి తర్వాత ఒకటిగా గ్యాప్ లేకుండా దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఆరెంజ్ అట్టర్ ప్లాప్ తో రామ్ చరణ్ పై తొలి దెబ్బ పడగా, ఆ తర్వాత నుంచి ఏదో ఒక దెబ్బ ఏదో ఒకరకంగా తగులుతూనే వుంది. తాజాగా, రామ్ చరణ్ కు అతని బాబాయి పవన్ కళ్యాణ్ బాగా క్లాస్ పీకినట్లు ప్రచారం జరుగుతోంది. 'ఆరెంజ్" సినిమా రూపకల్పనకు సంబంధించి..ఆ చిత్ర దర్శకుడు భాస్కర్ తానా అంటే రామ్ చరణ్ తందానా అని..ఆ చిత్రానికి ఘోరంగా ఖర్చు పెట్టించడంపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసాడని, ఇంటికి ప్రత్యేకంగా పిలిపించుకుని క్లాస్ పీకాడనే గుసగుసలు ఫిలింనగర్ లో వినిపిస్తున్నాయి.
'ఆరెంజ్" సినిమాను అట్టర్ ప్లాప్ అని డిక్లేర్ చేసిన 'సాక్షి" చానల్ ను 'ఇడియట్ చానల్" అని ట్విట్టర్ లో తిట్టడాన్ని కూడా పవన్ కళ్యాణ్ తప్పు పట్టాడని, ఇంకెప్పుడూ అలాంటి ఇడియాటిక్ కామెంట్స్ చేయవద్దని హితవు పలికాడని తెలుస్తోంది. ఇకపోతే, ఈ విషయమై మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండడం కూడా రామ్ చరణ్ కు పెద్ద తలనొప్పిగా మారింది. దెబ్బకి చరణ్ దిమ్మతిరిగి బాధపడుతున్నాడని సమాచరం..


Click it and Unblock the Notifications











