పవన్ కళ్యాణ్ మాస్ టైటిల్స్ తో ఇరగదీస్తున్నాడు...
'కొమరం పులి" ప్లాప్ దెబ్బకి పవన్ కళ్యాణ్ ఇప్పుడు క్రియేటివ్ వర్క్స్ మీద డిపెండ్ అవడం మానేసి ఎక్కువగా రీమేక్స్ మీద ఆధారపడుతూ బండి లాగిస్తున్నాడు. పులి లాంటి స్ట్రెయిట్ సినిమాల మీద రెండు సంవత్సరాలు వృధా చేయడం కంటే ఏడాదికి రెండు రీమేక్ లు చేసుకోవడం నయమని పవన్ ఫిక్స్ అయ్యాడు. ఇదిలావుంటే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రీమేకులే ఎక్కువగా చేస్తున్నా వాటిని మాస్ లోకి తీసుకెళ్లగలిగే ఆసక్తికరమైన టైటిల్స్ పెడుతున్నాడు.
'లవ్ ఆజ్ కల్" రేమేక్ కి 'తీన్ మార్"అనే పేరు పెట్టిన పవన్ దానికి 'సెలబ్రేషన్ ఆఫ్ లవ్" అనే చక్కని లవ్ ఫీల్ ఉన్న ట్యాగ్ లైన్ జత చేసి మాస్ నీ, క్లాస్ నీ ఆకట్టుకునే పేరు పెట్టడానికిపించుకున్నాడు. ఇక 'దబాంగ్" రీమేక్ కి 'గబ్బర్ సింగ్" అనే టైటిల్ పెట్టి కేవలం టాలీవడ్ మీడియానే కాక బాలీవుడ్ మీడియాని కూడా ఆకట్టుకున్నాడు. కాగా విష్ణువర్థన్ డైరక్షన్ లో చేసే సినిమాకి 'షాడో" అనే మరో ఇంట్రెసట్టింగ్ టైటిల్ సెట్ చేశారు.
నవలలు చదివే అలవాటున్న వారికి 'షాడో" పేరు, క్యారెక్టర్ గురించి టైటిల్ తో పవన్ సినిమా చేస్తూ షాడోకి మరింత పాపులారిటీ ఇవ్వబోతున్నాడు. సినిమాలు ఎలా ఉంటాయనేది తెలీదు కానీ ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ టైటిల్ తో ఇరగదీస్తూ రికార్డ్స్ క్రీయేట్ చేస్తూ, టాలీవుడ్ లో రోజురోజకీ హాట్ టాపిక్ గా తన చిత్రాలపై అంచనాలు పెంచేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











