Just In
- 7 min ago
కాపీక్యాట్ ఆరోపణలు.. మరి కేసులు ఎందుకు పెట్టలేదు.. కౌంటర్ ఇచ్చిన థమన్
- 24 min ago
తమిళ బిగ్ బాస్లోకి దేత్తడి హారిక: ఏకంగా కమల్ హాసన్తోనే అలా.. అరుదైన ఘనత సొంతం!
- 54 min ago
బీరు తాగుతూ.. సిగరెట్ కాల్చుతూ ఆరియానా రచ్చ: కలకలం రేపుతోన్న బోల్డ్ బ్యూటీ హాట్ వీడియో
- 1 hr ago
ప్రభాస్ ‘ఆదిపురుష్’ నుంచి ఊహించని అప్డేట్: వాళ్లందరినీ చూపించిన దర్శకుడు ఓం రౌత్
Don't Miss!
- News
extra aunty: భార్యతో సరసాలకు నో సిగ్నల్. రెచ్చి పోయిన ఆంటీ, అత్త కొంపకు నిప్పు పెట్టిన అల్లుడు !
- Finance
అదానీ గ్రూప్లో రూ.18,200 కోట్ల పెట్టుబడి, టోటల్ భారీ డీల్
- Sports
లంచ్ బ్రేక్.. భారత్ స్కోర్ 83/1! గెలవాలంటే 245 కొట్టాలి!
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఈరోజు తొందరపాటు నిర్ణయం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు...!
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
గుండుతో అభిమానులకు షాక్ ఇవ్వనున్న పవర్ స్టార్.. రిస్క్ అయినా తప్పదట?
టాలీవుడ్ వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలాంటి సినిమా చేసినా కూడా థియేటర్స్ లో విజిల్స్ పడాల్సిందే. వీలైనంత వరకు ఆడియెన్స్ అంచనాలకు తగ్గట్లుగానే పవన్ ను ప్రజెంట్ చేయడానికి దర్శకులు ప్రయత్నాలు చేస్తారు. ఇక పవన్ రీమేక్ సినిమా చేసినా కూడా తనదైన శైలిలో ఎట్రాక్ట్ చేస్తుంటాడు. ప్రస్తుతం వకీల్ సాబ్ కోసం ఎంతమంది ఎదురుచూస్తున్నారో గాని అంతకంటే ఎక్కువగా మాత్రం ఆ తరువాత వచ్చే సినిమాల కోసం ఎదురుచూస్తున్నారని చెప్పవచ్చు. అయితే ఒక సినిమా కోసం పవన్ గుండు కూడా చేయించుకుంటాడని టాక్ నడుస్తోంది.

సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
వకీల్ సాబ్ బాలీవుడ్ హిట్ మూవీ పింక్ కథకు రీమేక్ గా వస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ సినిమాపై అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. ఇక ఏప్రిల్ 9న విడుదల చేసే ఛాన్స్ ఉన్నట్లు రుమర్స్ అయితే వస్తున్నాయి. ఇక టీజర్ ను ఈ సంక్రాంతికి విడుదల చేయాలని ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. 14వ తేదీన సాయంత్రం 6గంటలకు టీజర్ రానుంది.

ఆ సినిమా కోసం మీసాలు కూడా..
ఇక ఆ సినిమా తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ తో బిజీ కానున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమా కోసం కేవలం 40రోజుల కాల్షీట్స్ ఇవ్వవచ్చని టాక్. ఇక క్రిష్ దర్శకత్వంలో కూడా పిరియాడిక్ స్టోరీలో నటించబోతున్న విషయం తెలిసిందే. అప్పట్లో ఆ సినిమా కోసం పవన్ కోర మీసాలు పొడవు జుట్టు కూడా పెంచాడు. .

పవన్ గుండుతో కనిపిస్తాడా?
లాక్ డౌన్ కారణంగా ప్లాన్స్ మొత్తం చేంజ్ అయ్యాయి. లేకుంటే ఈపాటికె ఆ సినిమా షూటింగ్ పూర్తయ్యేది. ఇక ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ రెండు విభిన్నమైన లుక్స్ తో కనిపిస్తాడట. ఒక విదంగా సెకండ్ హాఫ్ లో పవన్ జుట్టు లేకుండా గుండుతో కనిపిస్తాడని రూమర్స్ వస్తున్నాయి. అది ఎంతవరకు సెట్ అవుతుందనేది హాట్ టాపిక్ గా మారింది.
Kingfisher Calendar 2021 Superhot Model Photos

డైరెక్టర్ క్రిష్ అలా చెప్పాడంటే..
ఒక విదంగా ఈ రూమర్ ఆడియెన్స్ ను షాక్ కు గురి చేస్తోంది. పవన్ కళ్యాణ్ గుండు చేయించుకోవడం సెకండ్ ఆఫ్ స్టోరీకి చాలా అవసరమని తప్పకుండా ఆడియెన్స్ యాక్సెప్ట్ చేసే విధంగానే ఉంటుందని సమాచారం. డైరెక్టర్ క్రిష్ మేకింగ్ ఎలా ఉంటుందనేది అందరికి తెలిసిందే కాబట్టి ఎదో ముఖ్యమైన రీజన్ ఉంటుందని చెప్పవచ్చు. చూడాలి మరి ఈ రూమర్ ఎంతవరకు నిజమవుతుందో..