వకీల్ సాబ్ ఎఫెక్ట్ : దిల్ రాజు తో మరో సినిమా ఒప్పుకున్న పవన్.. ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలంగాణలో థియేటర్లు మూసివేసినా ఈ సినిమా థియేటర్లకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో కలెక్షన్స్ విషయంలో కొన్ని తేడాలు ఉండటంతో ఇప్పటికీ ఈ సినిమా కలెక్షన్స్ విషయం అధికారికంగా ప్రకటించడం లేదు దర్శకనిర్మాతలు.

అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఆసక్తికర అంశం ఒకటి ఫిల్మ్ నగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అదేమిటి అంటే పవన్ కళ్యాణ్ దిల్ రాజు తో మరో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే

యువ హీరోయిన్ గ్లామర్ ఫోటోషూట్.. లేత సొగసులను అలా దాచేస్తూ..

కలెక్షన్స్ విషయంలో నష్టాలు

కలెక్షన్స్ విషయంలో నష్టాలు

పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడం తన చిరకాల స్వప్నం అని చెప్పుకున్న టాలీవుడ్ లీడింగ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు వకీల్ సాబ్ సినిమాకు వచ్చిన రిజల్ట్ తో గాల్లో తేలి పోతున్నాడు. అయితే ఆ విషయం పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ లో టికెట్స్ విషయంలో ఆయన కాస్త ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం.. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా ముందు వరకు ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లు వేరేగా ఉన్నాయి.

ఎప్పుడైతే వకీల్ సాబ్ సినిమా రిలీజ్ అయిందో అప్పుడు ఎగ్జిబిటర్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య వివాదం చెలరేగి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో రేట్లను తగ్గించింది. ఈ నేపథ్యంలో సినిమా కలెక్షన్స్ విషయంలో చాలా నష్టాలు వచ్చినట్లు చెబుతున్నారు. ఇదే విషయాన్ని తాజాగా పవన్ కళ్యాణ్ ను కలిసిన దిల్ రాజు వివరించినట్లు సమాచారం.

30 రోజుల్లో ప్రేమించడం ఎలా హీరోయిన్ ఫోటోషూట్ వైరల్.. సరికొత్త అందాలతో

దిల్ రాజు కోరిన వెంటనే

దిల్ రాజు కోరిన వెంటనే

ఆ విషయం అలా ఉంచితే పవన్ కళ్యాణ్ తో మరో సినిమా చేయాలని ఉందని ఆకాంక్షను కూడా ఇదే సమయంలో దిల్ రాజు పవన్ కళ్యాణ్ కు వెలిబుచ్చిన ట్లు సమాచారం. దీంతో ఆంధ్రప్రదేశ్ విషయంలో కలెక్షన్స్ నష్టాలను చవి చూస్తున్న దిల్ రాజుకు ఏదో ఒక విధంగా సహాయ పడాలి అని భావించి, పవన్ కళ్యాణ్ దిల్ రాజు మరో సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు సమాచారం.

ఇక పవన్ కళ్యాణ్ సినిమా చేయడానికి ఒప్పుకున్న వెంటనే దిల్ రాజు మళ్లీ అడ్వాన్స్ కూడా ఇచ్చేసిన్నట్లు సమాచారం. అయితే ఈ ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతుండగా ఇందులో నిజానిజాలు ఏ మేరకు ఉన్నాయి అనేది తెలియాల్సి ఉంది.

బ్రాలో అందాలను ఆరబోసిన హీనా పంచల్.. బికినీలో అదరగొట్టిన యువ హీరోయిన్

మరో రెండేళ్ళు ఆగాల్సిందే

మరో రెండేళ్ళు ఆగాల్సిందే

ఒకవేళ అడ్వాన్స్ తీసుకున్నా సరే పవన్ ఇప్పటికిప్పుడు దిల్ రాజుతో కలిసి సినిమా చేసే అవకాశాలు లేవు. ఆ సినిమా చేయడానికి దాదాపు మరో రెండు సంవత్సరాలు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పవన్ ఇప్పటికే రెండు సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. మరో రెండు సినిమాలు లైన్లో ఉన్నాయి. మలయాళం సినిమా అయ్యప్పనుం కోషియుం తెలుగు రీమేక్ కోసం సినిమా షూటింగ్ ఒకపక్క జరుగుతుండగా మరోపక్క క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది.

ఈ రెండు సినిమా షూటింగ్స్ కూడా పవన్ కళ్యాణ్ కు అస్వస్థత ఏర్పడిన కారణంగా ఆపి వేశారు. అలాగే మరో పక్క సురేందర్ రెడ్డితో ఒక సినిమా, హరీష్ శంకర్ తో ఒక సినిమా కూడా పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశాడు. ఈ సినిమాలన్నీ పూర్తయ్యాక దిల్ రాజు సినిమా పట్టాలు ఎక్కే అవకాశం ఉంది.

అందానికి అందంగా ఈ పుత్తడి బొమ్మ... ప్రియా భవానీ శంకర్ బ్యూటీఫుల్ ఫోటో గ్యాలరీ

Recommended Video

Avengers Endgame Day 11 Box Office Collection, Breaks All The Records || Filmibeat Telugu
65 కోట్ల రెమ్యూనరేషన్

65 కోట్ల రెమ్యూనరేషన్

ఇక వకీల్ సాబ్ సినిమాకు గాను పవన్ కళ్యాణ్ కు భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ ఛార్జ్ చేసినట్లు సమాచారం. ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లుగా దాదాపు 65 కోట్ల రూపాయల మేర పవన్ కళ్యాణ్ కు వకీల్ సాబ్ సినిమా చేసినందుకుగాను అందినట్లు సమాచారం. అందులో 50 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ లభించగా లాభాల్లో వాటా రూపేణా మరో పదిహేను కోట్ల రూపాయలు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే దిల్ రాజుకి ఇది పెద్ద విషయం ఏమీ కాదు. ఎందుకంటే ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ మాత్రమే దాదాపు 150 కోట్ల దాకా పలికాయి. సో ఆ విషయంలో దిల్ రాజు ఎలాంటి ఇబ్బందులు లేవని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ కలెక్షన్స్ విషయంలో దిల్ రాజు నష్టం జరిగింది అనే భావనతో పవన్ మరో సినిమా చేస్తానని మాట ఇవ్వడం తో దిల్ రాజు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X