పవన్ నోట పంజా పాట..బ్రహ్మీపై!?

By Bojja Kumar

గతంలో పవన్ కళ్యాన్ హీరోగా వచ్చిన'జాని" చిత్రంలో పవన్ పాడిన 'నువ్వు సారాతాగుడు మానరన్నో.. లేకుంటే సచ్చివుర్కుంటావురన్నా" అనే బిట్‌సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. తాజాగా పవన్ మరోసారి స్వయంగా పాట పాడటానికి సిద్ధం అయ్యాడు. తన తాజా చిత్రం 'పంజా"లో ఓ ఫుల్‌సాంగ్‌ను పాడబోతున్నాడని సమాచారం. పవన్‌కళ్యాణ్ డాన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో బ్రహ్మానందంపై ఓ ప్రత్యేకపాటను చిత్రీకరించనున్నారు. ఈ పాటనే పవన్ ఆలపించబోతున్నాడట. సో.. పంజాకు పవన్‌పాట కూడా మరో ఆకర్షణగా మారనుంది. విష్ణువర్థన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాలో పవన్ సరసన సారాజాన్ డియాస్, అంజనా లవానియాలు నటిస్తున్నారు. విష్ణువర్ధన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ ఆర్కామీడియా, సంఘమిత్ర ప్రొడక్షన్స్ పతాకంపై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తమిళంలో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: రాహుల్ కోడా, మాటలు: అబ్బూరి రవి, కెమెరా: పి.ఎస్.వినోద్, ఆర్ట్: సునీల్‌బాబు, ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్, ఫైట్స్: శ్యామ్ కౌశల్, స్టైలింగ్: అనూవర్థన్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X