twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్ సిక్స్ ప్యాక్ బాడీ చూపించబోతున్నారా?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో వెండితెరపై సిక్స్ ప్యాక్ బాడీ చూపించబోతున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి. ఇటీవల ఆయన బెంగుళూరులోని ఓ ప్రముఖ ఫిట్ నెస్ సెంటర్లో దర్శనం ఇవ్వడంతో ఈ ప్రచారం మొదలైంది. అయితే ఇది త్రివిక్రమ్ సినిమా కోసమా? లేక సంపత్ నందితో చేయబోయే సినిమాలోనా? అనేది తేలాల్సి ఉంది.

    ప్రస్తుతం పవన్ కళ్యాన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'అత్తారింటికి దారేది'(వర్కింగ్ టైటిల్) చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. మే 3తో ఈ షెడ్యూల్ పూర్తి కానుంది.

    నెక్ట్స్ షెడ్యూల్ యూరఫ్ లో ప్లాన్ చేసారు. జూన్ మొదటి వారంలో అక్కడ షూటింగ్ మొదలు పెట్టనున్నారు. మొత్తం 25 రోజుల పాటు వివిధ లోకేషన్లలో షూటింగ్ జరుపాలని నిర్ణయించారు. ఈ మేరకు యూరప్ లోని లొకేషన్ల గురించి ఆరా తీస్తున్నారు. రొటీన్ లొకేషన్లు కాకుండా సరికొత్త లొకోషన్లపై దృష్టి సారించారు. ఇక్కడ కొన్ని సీన్లను చాలా స్టైలిష్‌గా, గ్రాండ్‌గా పిక్చరైజ్ చేసేందుకు దర్శకుడు త్రివిక్రమ్ ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

    ఆగస్టు 7వ తేదీన సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఆర్ట్ : రవీందర్, కో-ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.'

    English summary
    
 As per buzz, Pawan Kalyan is trying for a six-pack body but one week effort is not enough to get the six-pack body. However, Pawan is trying to get a new look by spreading some weight but it is not sure that whether he is spreading weight for Trivikram's film or Sampath Nandi's film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X