»   » బోలెడు సందేహాలు: పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదు?

బోలెడు సందేహాలు: పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న చిరంజీవి 150వ సినిమా ఎట్టకేలకు ఈ రోజు లాంచనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీకి చెందిన పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు అందరూ హాజరయ్యారు. ఈ వేడుకకు అందరూ హాజరైనా...అభిమానులకు మాత్రం ఓ లోపం కొట్టొచ్చినట్లు కనపడింది. అదేంటో మీకు ఇప్పటికే అర్థమయి ఉంటుంది... పవన్ కళ్యాణ్ ఈ వేడుకకు డుమ్మా కొట్టడం.

ఇటీవల శ్రీజ వివాహానికి కూడా పవన్ కళ్యాణ్ రాలేదు. అప్పుడంటే 'సర్దార్' మూవీ షూటింగ్ ఉంది. పైగా ఈ చిత్రానికి తనే నిర్మాత కాబట్టి డబ్బుల వ్యవహారం...త్వరగా పూర్తి చేసి విడుదల చేయాలనే ఆరాటం. అందుకే ఆ విషయాన్ని అంతా లైట్ తీసుకున్నారు. కానీ తాజాగా చిరంజీవి 150వ సినిమా ప్రారంభోత్సవానికి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరైనా పవన్ రాక పోవడం చర్చనీయాంశం అయింది.

Pawan Kalyan

దీంతో ఆయన ఏదైనా అర్జుంటు పనిలో ఉన్నారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మొన్ననే తన కొత్త సినిమా ప్రారంభోత్సవంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఇంకా షూటింగు కూడా మొదలు కాలేదు. పవన్ కళ్యాణ్ ఇంత ముఖ్యమైన కార్యక్రమానికి డుమ్మా కొట్టడానికి గల కారణం ఏమిటి? అనేది ఎవరికీ అర్థం కావడం లేదు.

ఇద్దరూ కలిసున్నట్లే ఉంటారు..కానీ అప్పుడప్పుడు ఇలా ఇద్దరి మధ్య ఏ దూరం ఉన్నట్లు ప్రవర్తిస్తుంటారు. బయట మాత్రం ఇద్దరి అనుబంధం బీటలుబారిందనే అనుమానాలు. కానీ ఇప్పటికీ సరైన సమాధానం దొకరని వైనం. మరి ఈ సందేహాలు, అనుమానాలు తీరేదెప్పుడో...?

చిరంజీవి 150వ సినిమా విషయానికొస్తే...సుధీర్ఘ నిరీక్షణ అనంతరం చిరంజీవి 150వ చిత్రం శుక్రవారం మధ్నాహ్నం 1.30 గంటలకు గ్రాండ్ గా మొదలైంది. ఈ ప్రారంభోత్సవ వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరైంది. ఈ సందర్భంగా రామ్ చరణ్, సురేఖ కలిసి తమ కొత్త ప్రొడక్షన్ కంపెనీ 'కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ' ప్రారంభించారు. అనంతరం చిరంజీవిపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి పరుచూరి వెంకటేశ్వరరావు క్లాప్ కొట్టారు. అల్లు అరవింద్ కెమెరా స్విచాన్ చేసారు. నాగబాబు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై రామ్ చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

English summary
Pawan Kalyan skipped Chiranjeevi 150th film launc. Even Pawan also skipped Sreeja's wedding bash.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X