పవన్ కళ్యాణ్...డైరక్టర్ ఎస్ జె సూర్య ని కొట్టాడా?
తనతో కొమురం పులి చిత్రం డైరక్ట్ చేస్తున్న దర్శకుడు ఎస్.జె.సూర్యని పవన్ కళ్యాణ్ కొట్టాడంటూ ఓ రూమర్ ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రయాణం చేస్తోంది. వారు చెప్పుకునే దాని ప్రకారం తలకోన అడవిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఓ రోజు ఉదయం పవన్ కళ్యాణ్ షూటింగ్ స్పాట్ కి చేరుకునేసరికి సూర్య యూనిట్ మెంబర్స్ లో ఒకరిని బండబూతులు తిడుతూ కనిపించారు. అతని పచ్చి బూతులు విన్న పవన్ కళ్యాణ్ పట్టరాని కోపంతో దర్శకుడుని చెంప చెళ్ళు మనిపించాడని..దాంతో ఆ రోజు షూటింగ్ కాన్సిల్ అయిందని చెప్తున్నారు. ఇద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉండేవారని, విషయమేమిటని పవన్...అడక్కుండా ఈ పనిచేయటం సూర్యని నొప్పించిందని, అలాగే యూనిట్ ముందు తనని అవమానపరిస్తే ..తర్వాత తాను వారితో ఎలా పనిచేయించుకోగలనని వాపోయాడని చెప్తున్నారు. అయితే పవన్ చాలా సెన్సిటివ్ గా ఉంటాడని, పొరపాటున కూడా డిసిప్లెన్ ఎవరు తప్పినా సీరియస్ అవతాడని, అంతేగాని వ్యక్తిగత కక్షతో కాదు కదా అని మరికొందరంటున్నారు. ఇంతకీ ఇది నిజమో...రూమర్ తెలియనంతలా స్ప్రెడ్ అవుతోంది.


Click it and Unblock the Notifications











