»   » దాన్ని అమ్మేసాడా?: పవన్ కళ్యాణ్ స్థితి అంత దారుణంగా ఉందా?

దాన్ని అమ్మేసాడా?: పవన్ కళ్యాణ్ స్థితి అంత దారుణంగా ఉందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినీ సెలబ్రిటీ సర్కిల్‌లో ఏదైనా విషయం అనఫియల్‌గా బయటకు లీకైంది అంటే...వాస్తవానికి అనేక ఊహాగానాలు ఉన్నవి లేనివి జోడించి మరీ ప్రచారం జరుగుతుంది. సదరు హీరో పొజిషన్‌‌ను సదరు వార్తల తీరు కూడా మారుతుంది.

ఏదైనా సినిమా హిట్టు తర్వాత ఒక స్టార్ హీరో ఏదైనా కొత్తవి కొనడం, పాతవి అమ్మడం లాంటివి చేస్తే... ఆ సినిమాతో డబ్బలు బాగా వచ్చాయి, అందుకే పాత సరుకు అమ్మేసి, కొత్త సరుకు కొంటున్నాడు అంటారు. అదే ఒక హీరో వరుస ప్లాపుల తర్వాత ..... ఇలాంటివి చేస్తే ఆర్థికంగా బాగా చితికి పోయాడు, చివరకు ఉన్న వస్తువులు అమ్ముకునే పరిస్థితికి వచ్చాడు అనే ప్రచారం జరుగుతుంది.

ప్రస్తుతం వరుస ప్లాపులతో ఉన్న పవన్ కళ్యాణ్ విషయంలో ఇలాంటి ప్రచారమే జరుగుతోంది. దీనికి తోడు ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానంటూ చెప్పడం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌కు ఆర్థికంగా బలాన్ని ఇచ్చే సినిమాలేవీ రాక పోవడంతో ఇపుడు ఆయన ఆర్థిక పరిస్థితి మీద నెగెటివ్ ప్రచారం జరుగుతోంది.

నిర్మాణంలో తాను భాగస్వామ్యం అయిన తీసిన 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ ఆర్థిక పరిస్థితి మరింత దెబ్బతిందని, ఇపుడు తన కార్లను కూడా అమ్ముకునే పరిస్థితి వచ్చిందంటూ ప్రచారం జరుగుతోంది. (స్లైడ్ షోలో పవన్ కళ్యాణ్ పరిస్థితి గురించి పూర్తి వివరాలు...)

బెంజి కారు..

బెంజి కారు..

పవన్ కళ్యాణ్ గతంలో మెర్సిడెస్ బెంజ్ జి55 మోడల్ కారును కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ పెళ్లి సమయంలో స్వయంగా ఈ కారునలోనే చెర్రీని తీసుకొచ్చాడు పవన్.

అమ్మేసాడా?

అమ్మేసాడా?

ఇపుడు ఆర్థిక పరిస్థితి బాగేలోక పోవడంతో పవన్ కళ్యాణ్ ఆ కారును అమ్మేశాడని ఫిలిం నగర్లో ప్రచారం జరుగుతోంది.

ఖరీదైన కారే..

ఖరీదైన కారే..

అప్పట్లో ఈ కారును దాదాపు రూ. 2 కోట్లు కొనుగోలు చేసారు పవన్ కళ్యాణ్.

అంత సీన్ ఉందా?

అంత సీన్ ఉందా?

పవన్ కళ్యాణ్ కో అంటే కోట్లు రూపాయలు అడ్వాన్స్ తీసుకుని ఆయన ముందు వాలే నిర్మాతలు చాలా మంది ఉన్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ ఆర్థిక పరిస్థితి కారణంగా కార్లు అమ్ముకునే స్థితి మాత్రం ఉండదనేది చాలా మంది అభిప్రాయం.

అదో లెక్కా..

అదో లెక్కా..

పవన్ కళ్యాణ్ ఒక్కో సినిమాకు కనీసం రూ. 15 నుండి 20 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుంటారు. అలాంటి ఆయన కనీసం కోటి రూపాయలు కూడా వాపస్ రాని కారును అమ్ముకునే ఆలోచన ఉంటుందా?

మరి ఎందుకోసమో?

మరి ఎందుకోసమో?

సినీ స్టార్స్ ఎంత ఖరీదైనా కారయినా సంవత్సరాల కొద్దీ వాడే పరిస్థితి ఉండదు. పవన్ కళ్యాణ్ ఆ కారు కొని నాలుగేళ్లు దాటింది. అందుకే దాన్ని అమ్మేసి కొత్త కారు కొనే ఆలోచనలో ఉన్నాడని అనుకోవచ్చు?

మరి కొత్త కారు రాలేదేం?

మరి కొత్త కారు రాలేదేం?

అయితే పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో కొత్త కారు కొన్న దాఖలాలు లేవు. ఒక వేళ అమ్మినా కొత్త కారు వచ్చిన తర్వాతే అమ్ముతారు? మరి అలాంటిదేమీ లేక పోవడంతో పవన్ కళ్యాణ్ మీద ఆర్థిక ఇబ్బందులు అనే రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి.

English summary
Film Nagar source said that, Pawan kalyan in Financial Crisis and sold his mercedes benz G55.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu