హీరోగా ఎంట్రీ ఇస్తున్న అకీరా నందన్: పవన్ కొడుకు పాన్ ఇండియా రేంజ్‌లో.. బడా నిర్మాత ప్లాన్
టాలీవుడ్‌లోని చాలా మంది స్టార్లు తమ వారసులను సినిమాల్లోకి తీసుకు వచ్చేశారు. అయితే, అందులో కొందరు మాత్రమే మంచి గుర్తింపును సొంతం చేసుకుని.. బడా స్టార్లుగా మారారు. దీంతో ఇంకెంత మందో తమ పిల్లలను తీసుకు వచ్చే పనిలో ఉన్నారు.
ఈ జాబితాలోకి ఇప్పుడు వచ్చి చేరాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఈ బడా హీరో తన కొడుకు అకీరా నందన్‌ను టాలీవుడ్‌లోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది. అంతేకాదు, ఈ మెగా యంగ్ ప్రిన్సెస్ చేయబోయే మూవీ జోనర్ కూడా బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళ్తే....

మెగా ఫ్యామిలీ నుంచి వాళ్లు
టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి స్వయంకృషితో వచ్చి పెద్ద స్టార్‌గా మారిపోయారు. ఆయన తర్వాత ఇదే ఫ్యామిలీ నుంచి నాగబాబు, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక ఇలా ఎంతో మంది పరిచయం అయ్యారు. వీరిలో చాలా మంది ఇప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోలుగా సత్తా చాటుకుంటున్నారు.

అకీరా కూడా వస్తున్నాడని
ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి ఎంతో మంది సినిమాల్లోకి వచ్చారు. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - రేణూ దేశాయ్ దంపతుల కుమారుడు అకీరా నందన్ కూడా సినీ రంగ ప్రవేశం చేస్తాడని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. అంతేకాదు, అతడిని ఫలానా దర్శకుడు పరిచయం చేస్తాడని తరచూ రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి.
రేణు దేశాయ్ క్లారిటీ ఇస్తూ
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడన్న వార్తలు వైరల్ అవుతోన్న నేపథ్యంలో దీనిపై రేణూ దేశాయ్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. గతంలో పలు ఇంటర్వ్యూల్లో ఆమె స్పందిస్తూ 'అకీరాకు ఇప్పుడు పెద్దగా వయసు రాలేదు. వాడికి ప్రస్తుతానికి సినిమాల్లోకి రావాలని లేదు. ఇప్పుడైతే చదువు మీదనే ఫోకస్ చేస్తున్నాడు' అని చెప్పారు.

అకీరా ఎంట్రీపైన రూమర్
పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్ ఫస్ట్ మూవీపై తరచూ ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా అతడి తొలి చిత్రం గురించి మరో క్రేజీ న్యూస్ తెరపైకి వచ్చింది. అతి త్వరలోనే అకీరా నందన్ ఫస్ట్ మూవీ లాంచ్ కాబోతుందట. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ వర్క్‌ను ఇప్పుడు జరుపుతున్నారని, త్వరలోనే ప్రకటన చేస్తారని సమాచారం.
పాన్ ఇండియా.. భారీగానే
అకీరా నందన్ ఫస్ట్ సినిమా గురించి న్యూస్ లీకైన వెంటనే దాన్ని ఎలా రూపొందించబోతున్నారు అనే వివరాలు కూడా బయటకు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని లవ్ అండ్ యాక్షన్ జోనర్‌లో పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కించబోతున్నారట. దీన్ని బడా నిర్మాణ సంస్థపై పెద్ద ప్రొడ్యూసర్ నిర్మిస్తున్నారని తెలిసింది. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











