Pawan Kalyan: అకిరా నందన్ ఎంట్రీ పవన్ సినిమాతోనే.. అభిమానులకు కిక్కిచ్చే సర్‌ప్రైజ్.
ఫ్యాన్స్ ఎప్పుడు కూడా స్టార్ హీరోలపై మాత్రమే కాకుండా వారి ఫ్యామిలీ ముఖ్యంగా వారి పిల్లలపై కూడా ప్రత్యేకమైన ప్రేమ చూపిస్తుంటారు. వారికి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకునేందు తెగ ఆసక్తి కనబరుస్తారు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో హార్డ్ కోర్ ఫ్యాన్స్ ను సంపాదించుకున్న పవన్ ఫ్యామిలీపై కూడా ఫ్యాన్స్ ఫోకస్ ఎక్కువగానే ఉంది. ఇక చాలా కాలంగా పవర్ స్టార్స్ ఫ్యాన్స్ అకిరా నందన్ ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు అతని ఎంట్రీకి సంబంధించిన ఒక న్యూస్ వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..
పవన్ కల్యాణ్ అంటే.:తెలుగు చిత్ర పరిశ్రమలో ఫ్యాన్స్ అయితే అటు అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీలపై మరింత ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. అందులోనూ ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే చాలా మంది పూనకాలతో ఊగిపోతుంటారు. ఆయన పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు అభిమానులు.

పవన్ సినిమాలో వారసుడు?:మా అన్నయ్య, మా అన్నయ్య అంటూ నెత్తిన పెట్టుకుంటారు. ఆయన భార్యను వదినా అంటూ, పిల్లలను వారసులు అంటూ మరింత ప్రేమ చూపిస్తుంటారు. అలాంటి పవన్ కల్యాణ్ సినిమా వస్తుందంటే ఫుల్ ఖుషీ అయిపోతుంటారు. అలాంటిది ఆయన చిత్రంలో పవర్ స్టార్ కుమారుడు కూడా కనిపించబోతున్నాడంటే వారి ఆనందానికి అవధులు ఉండవు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి సినిమా విడుదలయ్యేదాకా ప్రతీ అప్ డేట్ నూ ఫాలో అవుతారు.

ఒరిజినల్ గ్యాంగ్ స్టర్:పవన్ కల్యాణ్ హీరోగా తాజాగా సుజిత్ డైరెక్షన్ లో రాబోతున్న ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) గురించి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ చాలా వేగంగా జరుపుకుంటోంది. దీని స్పీడు చూస్తుంటే హరిహర వీరమల్లు చిత్రం కంటే ముందే రిలీజ్ అయ్యే సూచనలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఓ అదిరిపోయే అప్ డేట్ వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్ ఈ సినిమాలో కనిపించబోతున్నారట.

పవన్ కళ్యాణ్ పాత్రతోనే అకిరా..:ప్రస్తుతం మహాబలేశ్వర్‌లో షూటింగ్ జరుగుతోందట. అయితే ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ పాత్రను మూడు వేర్వేరు వయసుల్లో చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే 17 ఏళ్ల వయసులో ఉన్నట్లు కనిపించే క్యారెక్టర్ లో అకీరా నందన్ ను తీసుకుంటే బాగుంటుందని డైరెక్టర్ సుజీత్ కుమార్ భావిస్తున్నారట. ఇదే విషయాన్ని పవన్ కల్యాణ్ కు కూడా చెప్పారట. కానీ పవన్ ఇంకా దీనిపై ఏం స్పందించలేదట.

ఇది నిజమైతే కిక్కి మాములుగా ఉండదు:పవన్ కల్యాణ్, అకీరా నందన్ ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెప్తే... మనం పవర్ స్టార్ కొడుకును తెరపై చూడొచ్చు. అకీరా చాలా మంది సినీ నటులతో తరచుగా తిరుగుతుండడం చూస్తుంటే.. అతడికి సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉందని చాలా మంది అనుకుంటున్నారు. నిజంగానే ఆయనకు సినిమాల్లో నటించాలనే ఉద్దేశం ఉంటే తండ్రి సినిమాలో నటించడానికి కచ్చితంగా ఓకే చెబుతాడని అంతా భావిస్తున్నారు. మరి చూడాలి ఏం జరగనుందో. ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











