సినిమాల్లోకి పవన్ కల్యాణ్ కొడుకు అకీరా.. తమ్ముడి కోసం రంగంలోకి రామ్ చరణ్
టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలంగా ప్రభావాన్ని చూపిస్తూ స్టార్ హీరోగా వెలుగొందుతోన్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. అదే సమయంలో కొన్ని కోట్ల మంది అభిమానాన్ని సైతం సొంతం చేసుకున్నాడు. ఈ జోష్‌లోనే వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు రాజకీయాలపై ఫోకస్ చేసిన పవన్.. ఎన్నికలకు సన్నద్దం అవుతున్నాడు. అయితే, అతడి కుమారుడు అకీరా నందన్ మాత్రం సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ బాధ్యతను తీసుకున్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీరే చూడండి!
గేమ్ చేంజర్‌గా రామ్ చరణ్
పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం లెజెండరీ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో 'గేమ్ చేంజర్' అనే మూవీలో నటిస్తున్నాడు. ఈ చిత్రంపై ఆరంభంలోనే అంచనాలు భారీగా నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్నారు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా వరకూ కంప్లీట్ అయింది. దీన్ని వచ్చే అక్టోబర్‌లో విడుదల చేస్తున్నారు.

బుచ్చిబాబుతో మరో మూవీ
తన 16వ సినిమాను రామ్ చరణ్ 'ఉప్పెన' దర్శకుడు బుచ్చిబాబుతో చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ప్రకటన చాలా రోజుల క్రితమే వెలువడింది. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకటేష్ సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. దీనికి మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది.
పూజ పూర్తి చేసిన చరణ్
శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'గేమ్ చేంజర్' మూవీకి సంబంధించిన షూటింగ్‌ను ఇప్పటికే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చాలా వరకూ కంప్లీట్ చేసేశాడు. మరో రెండు వారాల డేట్స్ ఇస్తే ఈ సినిమా పూర్తి అయిపోతుంది. దీని తర్వాత బుచ్చిబాబు సనతో సినిమాను ప్రారంభించబోతున్నాడు. ఇక ఇటీవలే రామ్ చరణ్ ఈ మూవీ పూజా కార్యక్రమాలను పూర్తి చేశాడు.

అకీరా నందన్ బాధ్యత
ఒకవైపు వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్ బాధ్యతను తీసుకున్నాడని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. అతడిని సినిమాల్లోకి తీసుకు రావాలని చరణ్ ప్లాన్ చేస్తున్నాడట. ఇందుకోసం అదిరిపోయే ప్లానింగ్‌ను సైతం అమలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
చరణ్ సినిమాలో అకీరా
అకీరా నందన్ త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. అది కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ద్వారా అని అంటున్నారు. బుచ్చిబాబుతో అతడు చేయబోయే సినిమాలో కీలక పాత్రను చేయడం ద్వారా అకీరా నందన్ యాక్టింగ్ కెరీర్‌ను మొదలు పెట్టబోతున్నాడని తాజాగా న్యూస్ వైరల్ అవుతోంది.

అత్యంత కీలక పాత్రలో
క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ చిత్రంలో ఇప్పటికే ఎంతో మంది బడా స్టార్లు భాగం అయ్యారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఇందులో రామ్ చరణ్ పక్కనే ఉండే ఓ పాత్ర కోసం అకీరా నందన్‌ను తీసుకున్నారని తెలిసింది. ఇప్పటికే అతడికి బుచ్చిబాబు స్టోరీని కూడా వినిపించాడని తెలిసింది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











