Akhira Nandan : అకీరా నందన్ మూవీకి డైరెక్టర్ ఫిక్స్.? ఎవరు? ఎప్పుడు స్టార్ కాబోతుంది?
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ టాలీవుడ్ ఎంట్రీపై ఎంత ఆసక్తి నెలకొన్నదో తెలిసిందే. ఇప్పటికే పలు రకాల వార్తలు, ఊహాగానాలు ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు, అప్పుడు అంటూ అకీరా నందన్ డెబ్యూ ఫిల్మ్ పై ఆసక్తికరమైన రూమర్లు వస్తూనే ఉన్నాయి. ఇంతవరకు ఎలాంటి సాలిడ్ అప్డేట్ మాత్రం అందలేదు. కానీ తాజాగా అకీరా నందన్ ను డైరెక్ట్ చేయబోయే అవకాశం ఓ తమిళ దర్శకుడికి దక్కిందని తెలుస్తోంది.
అకీరా నందన్ తొలిసినిమా ఎప్పుడు ప్రారంభం కాబోతున్నదనే న్యూస్ కొన్నాళ్లుగా నెట్టింట చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఇక రాజకీయాల్లోనూ ఫుల్ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ మున్ముందు సినిమాల చేస్తారా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలో తన వారసుడు అకీరా నందన్ ను అతి త్వరలో లాంచ్ చేసే పనిలో నిమగ్నమయ్యారని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. ఇందుకు సంబంధిన ఏర్పాటు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయని తెలుస్తోంది.

కాగా అకీరా నందన్ ను ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ లాంచ్ చేయబోతుండటం మరింత ఆసక్తికరంగా మారింది. సూపర్ స్టార్ మహేశ్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ లను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసింది అశ్వినీ దత్ నే కావడం విశేషం. ఇప్పుడు అకీరా నందన్ బాధ్యతలను కూడా ఆయనే తీసుకున్నారని తెలుస్తోంది. కాగా మూవీ ఎప్పుడు? స్టార్ అవుతుంది? ఎవరు అకీరాను డైరెక్ట్ చేయబోతున్నారనే అంశాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఈ క్రమం లోనే అకీరా నందన్ ప్రముఖ దర్శకుడి డైరెక్షన్ లో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారని తెలుస్తోంది.
అకీరా నందన్ మొదటి చిత్రాన్ని తమిళ దర్శకుడు విష్ణు వర్ధన్ డైరెక్ట్ చేసే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే ఈ విషయంపై ఇండస్ట్రీలో స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ - విష్ణు వర్ధన్ కాంబోలో 'పంజా' చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆశించిన మేర ఫలితానివ్వలేకపోయినా.. పవర్ స్టార్ అభిమానులను ఎంతగానో ఫిదా చేసింది. పవన్ ను ఓ రేంజ్ లో ఎలివేట్ చేయడం అభిమానులనే కాదు నార్మల్ ఆడియెన్స్ కు కూడా గూస్ బంప్స్ ను తెప్పించింది. ఈయన తమిళంలో అజిత్ తో 'బిల్లా'ను తెరకెక్కించి ప్రశంసలు అందుకున్నారు.

గత ఇంటర్వ్యూల్లోనూ విష్ణువర్ధన్ అకీరా నందన్ గురించి మాట్లాడారు. 'పంజా' సమయంలో అతను చాలా చిన్నవాడని.. ప్రస్తుతం యాక్టింగ్ లో ఓనమాలు నేర్చుకుంటున్నాడని తెలిపారు. అకీరాను డైరెక్ట్ చేసే అవకాశం ఉండొచ్చని గతంలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం మాత్రం విష్ణువర్ధన్ పేరు గట్టిగా వినిపిస్తోంది. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. అకీరా నందన్ ప్రస్తుతం వైజాగ్ లోనే యాక్టింగ్ స్కిల్స్ పై శిక్షణ పొందుతున్నారు. కొంత సమాచారం ప్రకారం ఈ ఏడాదే అకీరా ఫస్ట్ ఫిల్మ్ ప్రారంభం కానుందని అంటూంటే.. మరొక పక్క 2026లో ఫిక్స్ అని అంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన డెబ్యూ ఫిల్మ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొద్దిరోజులు ఆగితే మరింత స్పష్టత రానుంది.


Click it and Unblock the Notifications











