హరిహర వీరమల్లు రిలీజ్ అప్పుడే.. చిరంజీవితో పవన్ పోటీపై క్లారిటీ
తెలుగు చిత్ర పరిశ్రమలో సుదీర్ఘ కాలంగా ప్రభావాన్ని చూపిస్తూ.. టాప్ హీరోగా దూసుకుపోతోన్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. చాలా కాలం పాటు వరుసగా సినిమాలు చేసిన అతడు.. కొన్నేళ్ల పాటు గ్యాప్ తీసుకుని 'వకీల్ సాబ్'తో రీఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుంచి వరుసగా మూవీలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఇలా ఇప్పుడు పవన్ చేస్తున్న చిత్రాల్లో 'హరిహర వీరమల్లు' ఒకటి.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తోన్న చిత్రమే 'హరిహర వీరమల్లు'. భారీ బడ్జెట్‌తో రాబోతున్న ఈ క్రేజీ మూవీని మొగల్ చక్రవర్తుల కాలం నాటి కథతో భారీ బడ్జెట్‌తో తీస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

హై రేంజ్ బడ్జెట్‌తో రూపొందుతోన్న 'హరిహర వీరమల్లు' సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే మొదలైంది. కానీ, అనివార్య కారణాల వల్ల షూటింగ్‌కు చాలా బ్రేకులు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో దీనికి సంబంధించిన టాకీ పార్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ అనుకుంది. కానీ, పవన్ ఏపీ ఎలెక్షన్లతో బిజీగా ఉండడంతో షూట్‌ను వాయిదా వేసేశారు.
'హరిహర వీరమల్లు' షూటింగ్ ఇప్పట్లో జరిగే అవకాశం లేకపోవడంతో ఈ మూవీని పూర్తిగా ఆపేశారని ఇటీవలే ఓ న్యూస్ వైరల్ అయింది. ఈ పరిస్థితుల్లో త్వరలోనే గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ అనౌన్స్ చేసి, ఆ పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కాబోతుందని న్యూస్ లీకైంది. తాజాగా దీనిపై క్లారిటీ వచ్చింది.
'హరిహర వీరమల్లు' మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తారని ఇటీవలే న్యూస్ లీకైంది. అదే జరిగితే జనవరి 10న రిలీజ్ కానున్న చిరంజీవి 'విశ్వంభర'తో ఇది పోటీ పడుతుంది. కాబట్టి ఇది సాధ్యం కాదు అని చర్చ జరుగుతోంది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. పవన్ మూవీ జనవరి 15వ తేదీన వస్తుందట. అంటే ఈ రెండు చిత్రాలకు 5 రోజుల గ్యాప్ ఉంటుందని చెప్పొచ్చు.

ఇదిలా ఉండగా.. 'హరిహర వీరమల్లు' సినిమా భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోంది. ఇందులో నిధి అగర్వాల్ కీలక పాత్రను చేస్తోంది. బాబీ డియోల్ ఇందులో విలన్‌గా చేస్తున్నాడు. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం ప్రొడ్యూస్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











