పవన్ కళ్యాణ్ ఓజీ షూటింగ్ కు ఆటంకం.. కారణం ఏంటంటే?

సాహో.. వంటి బ్లాక్ బాస్టర్ ను అందించిన తర్వాత యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ డైరెక్ట్ చేస్తున్న చిత్రం OG. పవర్ స్టార్, ఏపీ ఉప ముఖ్యమంత్రి ఈ చిత్రంలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తైనట్టు తెలుస్తోంది. మిగితా షూటింగ్ పార్ట్ కు సంబంధించిన సీన్లను ఏపీలోనే పూర్తి చేస్తున్నారు. అయితే చాలా గ్యాప్ తర్వాత రీసెంట్ గానే సినిమా షూటింగ్ ప్రారంభమై అంతలోనే బ్రేక్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది.

ఓజీ మూవీ వివరాలు..
మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ఓజీ చిత్రాన్ని డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మాత డీవీవీ దానయ్య రూ.250 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. సుజీత్ దర్శకత్వం వహిస్తుండగా పవన్ కళ్యాణ్, ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మి విలన్ పాత్రను పోషిస్తుండటం విశేషం. ఈ మూవీ షూటింగ్ ముంబై, హైదరాబాద్ లో జరుగుతూ వస్తోంది. అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, శ్రియా రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.

Pawan Kalyan Sujeeth s upcoming film OG shooting on hiatus Because

ఓజీ షూటింగ్ కు మళ్లీ బ్రేక్..
ఈ మూవీ షూటింగ్ 2023 ఏప్రిల్ లో ముంబై లో ప్రారంభమైంది. మే 2 వరకు నిర్విరామంగా షూటింగ్ జరిగింది. ఆ తర్వాత రెండోవ షెడ్యూల్ ను పూణె, హైదరాబాద్ లో జరిపారు. ఇందులో ప్రియాంక మోహన్, ఇమ్రాన్ హష్మీ పాల్గొని కీలక సన్నివేశాలను పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత సినిమా షూటింగ్ కు ఏపీ ఎన్నికల ద్వారా అంతరాయం కలిగింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మళ్లీ 2024 అక్టోబర్ ప్రారంభించారు. మళ్లీ అంతరాయం కలిగింది. ఇక తిరిగి 2025 మే14న షూట్ కు సంబంధించిన ప్రొడక్షన్ పనులను ప్రారంభించారు. అయితే షూటింగ్ ప్రారంభం అయిన కొద్ది రోజులకే మళ్లీ అంతరాయం కలిగింది. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ డెంగ్యూకు గురికావడంతో ప్రస్తుతం 7 రోజుల షూట్ కు బ్రేక్ ఇచ్చారు.

ప్రత్యేకమైన సెట్స్ లో..
ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పొలిటికల్ ప్రొగ్రామ్స్ కారణంగా ఓజీ మూవీ షూటింగ్ లోకేషన్స్ లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. విదేశాల్లో చిత్రీకరించిన సీన్లను ఆంధ్రప్రదేశ్ లోని తాడేపల్లిలో ప్రత్యేకమైన సెట్స్ ఏర్పాటు చేసి చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేశారు. పవన్ కళ్యాణ్ కూడా తన షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

పవన్ కళ్యాణ్ నెక్ట్స్ సినిమాలు..
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ కళ్యాణ్ మొదటి సారిగా 'హరి హర వీరమల్లు'తో వెండితెరపై కనిపించబోతున్నారు. ఈ చిత్రం జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ తర్వాత ఓజీ, హరీశ్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలో అలరించబోతున్నారు. అభిమాలు పవన్ కళ్యాణ్ చిత్రాల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

More from Filmibeat

Read more about: pawan kalyan sujeeth og movie
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X