క్రేజీ న్యూస్.. రాంచరణ్ సినిమాకు పవన్ కళ్యాణ్ టైటిల్!
Recommended Video

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న తాజా చిత్రం బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. బోయపాటి శ్రీను అదిరిపోయే మాస్ ఎంటర్ టైనర్ ని తెరకెక్కిస్తున్నా మెగా ఫాన్స్ మాత్రం నిరాశలోనే ఉన్నారు. దానికి కారణం సినిమా ప్రారంభమై చాలా కాలం గడుస్తున్నా ఇంతవరకు టైటిల్ కూడా ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో దసరాకు ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది.

మెగా ఫ్యాన్స్‌కు క్రేజీ న్యూస్
తాజగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం రాంచరణ్, బోయపాటి చిత్రానికి పవన్ కళ్యాణ్, చిరంజీవి సినిమాల కలయికలో ఉండే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో మెగా ఫాన్స్ లో ఉత్సాహం పెరిగింది. అధికారికంగా ప్రకటించక పోయినా ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పవర్ ఫుల్ టైటిల్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. రాంచరణ్ చిత్రానికి తమ్ముడు అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కథ పరంగా రాంచరణ్ కొంత మంది సోదరులకు తమ్ముడు కావడంతో ఈ టైటిల్ పరిశీలిస్తున్నట్లు ఫిలిం నగర్ లో టాక్.

తమ్ముడు,స్టేట్ రౌడీ కలయికలో
అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా టైటిల్ కలసిఉండేలా కూడా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి కొందరు నెటిజన్లు వైరల్ చేస్తున్న న్యూస్ ప్రకారం తమ్ముడు,స్టేట్ రౌడీ కలయికలో ఈ టైటిల్ ఉంటుందని అంటున్నారు.

భారీ స్థాయిలో నిర్మాణం
ఇదిలా ఉండగా రాంచరణ్ సరసన ఈ చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఆర్యన్ రాజేష్, సీనియర్ హీరోయిన్ స్నేహ కీలకమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల అజార్బైజాన్ దర్శకుడు భారీ యాక్షన్ సన్నివేశాన్ని రాంచరణ్ పై చిత్రీకరించాడు.


Click it and Unblock the Notifications











