పవన్ కళ్యాణ్‌కు జోడీగా ఆ హీరోయిన్? సురేందర్ రెడ్డికి నిరసన సెగ.. ఏం జరిగిందంటే?

వరుస సినిమాలతో అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. గతేడాది హరిహర వీరమల్లు, ఓజీలతో ఆయన ఫ్యాన్స్‌ని ఖుషి చేశారు. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్‌ని సిద్ధం చేస్తున్నారు పవన్. ఈ ఏడాది మార్చి 26న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది. అయితే ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ సినీ కెరీర్‌కు రిటైర్మెంట్ చెబుతారా? పూర్తిగా రాజకీయాలకే అంకితమవుతారా? అప్పుడప్పుడు సినిమాలు చేస్తారా? అంటూ రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అయితే వీటికి చెక్ పెట్టారు పవన్ కళ్యాణ్.

సురేందర్ రెడ్డితో పవన్ కళ్యాణ్ సినిమా
సురేందర్ రెడ్డితో తాను ఒక సినిమా చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ సినిమా కోసం పూర్తిగా మేకోవర్ అవుతున్నారు. కొంచెం బాడీ పెంచడంతో పాటు స్టైలీష్‌గా గడ్డం కూడా పెంచుతున్నారు. కొత్త లుక్‌లోనే తన రాజకీయ భేటీలకు, కేబినెట్ సమావేశాలకు, ఇతర అధికారిక కార్యక్రమాలకు హాజరవుతున్నారు. స్టైలీష్ లుక్‌లో ఉన్న పవన్‌ను చూసి అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని జనసేనాని కూడా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.

Pawan Kalyan Surender Reddy Film Rumors Spark Controversy Over Imanvi Esmail as Female Lead

సంక్రాంతి బరిలో పవన్?
పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పవన్ కళ్యాణ్ - సురేందర్ రెడ్డి మూవీ విడుదల కానుంది. రామ్ తాళ్లూరి ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్, మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ తెరకెక్కుతున్నట్లుగా ఫిలింనగర్ టాక్. ఓజీలో గ్యాంగ్‌స్టర్‌గా పవన్ కళ్యాణ్ అలరించడం... ప్రేక్షకులు కూడా యాక్సెప్ట్ చేయడంతో ఇదే సబ్జెక్ట్‌తో ముందుకు వెళ్లనున్నారని వార్తలు వస్తున్నాయి. సురేందర్ రెడ్డి - పవన్ కళ్యాణ్ మూవీకి అనిరుద్ రవిచందర్ సంగీతం అందించనున్నారని తెలుస్తోంది. అలాగా ఈ మూవీలో పవన్ కళ్యాణ్‌ను ఢీకొట్టే పవర్‌ఫుల్ విలన్‌గా ఓ స్టార్ హీరో నటిస్తారని తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా 2027 జనవరి 12న పవన్ కళ్యాణ్ - సురేందర్ రెడ్డి మూవీ విడుదల కానుందని సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

పవన్ కళ్యాణ్ సరసన ఆ హీరోయిన్?
తాజాగా పవన్ కళ్యాణ్ - సురేందర్ రెడ్డి మూవీపై మరో గాసిప్ వైరల్ అవుతోంది. అదే పవన్ కళ్యాణ్ సరసన నటించే హీరోయిన్ ఎవరా అని. ఈ లిస్ట్‌‌లో చాలా పేర్లు వైరల్ కాగా.. ఓ ముద్దుగుమ్మను మేకర్స్ సెలెక్ట్ చేసినట్లుగా ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమె ఎవరో కాదు.. ఫౌజీ ఫేమ్ ఇమాన్వీ ఇస్మాయిల్ . అయితే దీనిపై అధికారికంగా ప్రకటన రాకుండానే కొందరు దీనిని వివాదం చేస్తున్నారు. కారణం.. ఆమె మూలాలు. ఇమాన్వీ పాక్ సంతతికి చెందిన అమ్మాయి.

పాక్ నటీనటులపై నిషేధం
ప్రస్తుతం దేశంలోని పరిస్దితులు, పాకిస్తాన్‌తో వైరం నేపథ్యంలో పాకిస్తాన్ నటీనటులపై దేశ ప్రజలు భగ్గుమంటున్నారు. బాలీవుడ్‌తో పాటు కొన్ని పరిశ్రమలు కూడా పాక్ కళాకారులపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ మూవీలో ఇమాన్వీని హీరోయిన్‌గా ఎలా తీసుకుంటారంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఒకవేళ హీరోయిన్‌గా తీసుకుంటే మాత్రం వెంటనే తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వార్నింగ్ ఇస్తున్నారు.

నా రక్తంలోనే భారతీయత
కాగా.. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా గతేడాది భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్‌పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. పలు ఉగ్రవాద స్థావరాలను, వైమానిక స్థావరాలను భారత సైన్యం నేలమట్టం చేసి ఉగ్రవాదులను హతమార్చింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్‌తో అన్ని రకాల సంబంధాలను భారత్ తెంచుకుంది. ఇదే సమయంలో దాయాది దేశానికి చెందిన నటీనటులు, గాయకులు, ఇతరులకు అవకాశాలు ఇవ్వకూడదని పలు పరిశ్రమలు నిర్ణయం తీసుకున్నాయి. దాంతో ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఫౌజీలో హీరోయిన్‌గా ఎంపికైన ఇమాన్వీపై ట్రోలింగ్ జరిగింది.

దాంతో ఆమె స్పందించారు. పాకిస్తాన్‌ నుంచి వలస వెళ్లిన తల్లిదండ్రులకు తాను అమెరికాలో జన్మించానని.. పాక్‌లోని ఏ వ్యక్తికి, ఏ వ్యవస్థకు మా కుటుంబంతో సంబంధాలు లేవని తేల్చిచెప్పింది. భారతీయత, సంస్కృతి నా రక్తంలోనే ఉందని ఇమాన్వీ పేర్కొంది. మరి తాజాగా పవన్ కళ్యాణ్ మూవీ హీరోయిన్‌ విషయంలో వస్తున్న ఊహాగానాలపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఇంతకీ ఇమాన్వి హీరోయిన్‌గా ఎంపికైందా? లేక గాలివార్తలే అన్నది తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X