»   »  పవన్ కళ్యాణ్‌ వీక్‌నెస్... త్రివిక్రమ్ సూచనతో కోట్లలో అడ్వాన్స్?

పవన్ కళ్యాణ్‌ వీక్‌నెస్... త్రివిక్రమ్ సూచనతో కోట్లలో అడ్వాన్స్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏదైనా కమిట్మెంట్ తీసుకుంటే మాగ్జిమమ్ దానికి కట్టుబడి ఉండే హీరో అనే పేరు ఇండస్ట్రీలో ఉంది. ఆయన ఎవరితోనైనా సినిమా చేస్తానని మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకోవడానికి తన శక్తిమేర ప్రయత్నిస్తారు. తనకు కష్టమైనా, నష్టమైనా మాట ఇచ్చాడంటే నిలబెట్టుకోవడం ఆయన వీక్ నెస్.

జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అ..ఆ లాంటి విజయవంతమైన సినిమాలు చేస్తూ దూసుకెలుతున్న నిర్మాత ఎస్.రాధాకృష్ణకు పవన్ కళ్యాణ్ గతంలో సినిమా చేస్తానని మాట ఇచ్చారు. త్వరలోనే దాన్ని నిలబెట్టుకోబోతున్నారు పవర్ స్టార్. ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహించబోతున్నారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎస్.జె.సూర్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే..ఇది పూర్తయిన తర్వాత వచ్చే ఏడాది ఎస్.రాధాకృష్ణ నిర్మాణంలో తెరకెక్కే సినిమా ప్రారంభం కాబోతోంది. అయితే సినిమా ప్రారంభోత్సవం మాత్రం ఈ ఏడాది డిసెంబర్లోనే చేయాలని ప్లాన్ చేస్తున్నారట త్రివిక్రమ్.

ఇటీవల పవన్ కళ్యాణ్ కు స్క్రిప్టు వినిపించి గ్రీన్ సిగ్నల్ తీసుకున్న త్రివిక్రమ్ త్వరలోనే ప్రీప్రొడక్షన్ పనులు ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అంతే కాదు నిర్మాత ఎస్.రాధాకృష్ణకు చెప్పి వన్ కళ్యాణ్ కు భారీ మొత్తంలో అడ్వాన్స్ ముట్టజెప్పేలా ప్లాన్ చేసారట. ఇటీవలే ఆయన పవన్ కళ్యాణ్ ను కలిసి చెక్కు అందజేసినట్లు సమాచారం.

భారీ రెమ్యూనరేషన్

భారీ రెమ్యూనరేషన్


ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ రూ. 20 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.

అడ్వాన్స్

అడ్వాన్స్


తీసుకునే రెమ్యూనరేషన్లో పావు వంతు అడ్వాన్స్... అంటే రూ. 5 కోట్ల వరకు ఇచ్చినట్లు టాక్. ము

త్రివిక్రమ్

త్రివిక్రమ్


మున్ముందు ఎలాంటి అవాంతరాలు, ఆలస్యం లాంటివి జరుగకుండా త్రివిక్రమ్ అన్నీ పక్కాగా ప్లాన్ చేస్తున్నారు.

వీకెనెస్

వీకెనెస్


పవన్ వీక్ నెస్ త్రివిక్రమ్ కు బాగా తెలుసు కాబట్టి....ఆయన మరింత కమిట్మెంట్ గా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఇంత భారీ మొత్తం అడ్వాన్స్ గా ఇప్పించారట.

English summary
S Radhakrishna who produced next moviewith director Trivikram will also be producing fourth film with the same director. And Pawan Kalyan has agreed to do this movie. Last week, Radhakrishna went to Pawan Kalyan’s farm house in Hyderabad and handed over him the cheque for advance payment.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu