అభిమానుల కోసం ఎదో ఒకటి చేయండి.. నిర్మాతకు పవన్ సలహా
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కాలం తరువాత వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ఇప్పటికే చాలా సార్లు అర్ధమయ్యింది. మొదట్లో షూటింగ్ చేస్తున్న సమయంలో లీకైన ఫొటోనే పోస్టర్ గా మార్చేశారు అభిమానులు. ఇక ఆ తరువాత ఫస్ట్ లుక్ అలాగే మొదటి సాంగ్ కూడా ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది.
లాక్ డౌన్ లేకపోయి ఉంటే సినిమా సమ్మర్ లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేది. ఇక ఎప్పుడైతే ఆ ఎఫెక్ట్ పడిందో అప్పటి నుంచి సినిమా రిలీజ్ డేట్ సస్పెన్స్ లో పడింది. పైగా సినిమాకు సంబంధించిన ఫస్ట్ టీజర్ కూడా విడుదల చేయలేదు. ఆ మధ్య పవన్ పుట్టినరోజున అయినా టీజర్ వస్తుందని అనుకున్న అభిమానులకు నిరాశ తప్పలేదు. కేవలం మోషన్ పోస్టర్ తో సరిపెట్టారు. ఇక రీసెంట్ గా చిత్ర నిర్మాత దిల్ రాజుతో పవన్ చర్చలు జరిపినట్లు టాక్ వస్తోంది.

అభిమానుల నుంచి వస్తున్న డిమాండ్ గురించి తెలుసుకున్న పవన్ వాళ్ళ కోసం ఏదైనా రిలీజ్ చేయండి అంటూ మాట్లాడారట. కానీ దిల్ రాజు థియేటర్స్ పై ఒక క్లారిటీ వచ్చిన తరువాత ఓకేసారి హైప్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నాడు. మధ్యలో గ్యాప్ ఇవ్వడం ఆయనకు ఇష్టం లేదు. ఇక పవన్ కళ్యాణ్ స్పెషల్ గా చెప్పిన తరువాత తప్పదు అని చిన్న టీజర్ ఏదైనా రిలీజ్ చేయలని దర్శకుడితో చర్చించినట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











