ఉగాదికి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్న పవన్ కళ్యాణ్.. మరొక హీరోతో కలిసి..
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో ఎక్కువగా రీమేక్ సినిమాలతో హాట్ టాపిక్ గా నిలుస్తున్న ఏకైక హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తన కెరీర్ లో ఇప్పటికే పదికి పైగా రీమేక్ సినిమాలతో మంచి విజయాలను అందుకున్న పవన్ కళ్యాణ్ రీసెంట్ గా భీమ్లా నాయక్ సినిమాతో మరో పవర్ ఫుల్ సక్సెస్ సొంతం చేసుకున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ మరొ రీమేక్ సినిమాతో త్వరలోనే రాబోతున్నట్టు గా తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..
పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ కంటే ముందు చేసిన వకీల్ సాబ్ సినిమా కూడా హిందీ సినిమా పింక్ కు రీమేక్ గా వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అందుకుంది. ఇక రీసెంట్ గా వచ్చిన భీమ్లా నాయక్ సినిమా మలయాళంలో మంచి విజయాన్ని అందుకున్న అయ్యప్పనుమ్ కొశీయుమ్ కు రీమేక్ గా వచ్చింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వీకెండ్ లోనే 50 కోట్ల వసూళ్లను అందుకోవడం విశేషం. ఇక ఈ వారంలో సినిమా బాక్సాఫీస్ టార్గెట్ ను పూర్తిగా చేస్తుంది అని అంచనా వేస్తున్నారు.

భీమ్లా నాయక్ సినిమాకు స్క్రీన్ ప్లే మాటలు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించిన విషయం తెలిసిందే. అయితే త్రివిక్రమ్ ఆధ్వర్యంలోనే పవన్ కళ్యాణ్ మరో రీమేక్ సినిమాను లైన్లో పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. తమిళంలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న వినోదయ సీతం సినిమాను రీమేక్ చేయడానికి సముద్రఖని గత ఏడాది నుంచి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ కు మొదట ఆ కథను వివరించడంతో కథ విషయంలో కొన్ని మార్పులు చేస్తే తప్పకుండా తెలుగులో బాక్సాఫీస్ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అని సలహా ఇచ్చాడట. ఇక సముద్రకని త్రివిక్రమ్ ఇచ్చిన సలహా మేరకు కథలో మరిన్ని మార్పులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు సాయి ధరమ్ తేజ్ కూడా మరొక ముఖ్యమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు కూడా అందించబోతున్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపించబోతున్నాడు. హిస్టారికల్ నేపథ్యంలో 16వ శతాబ్దంలోనే కొన్ని అంశాలను హైలెట్ చేస్తూ దర్శకుడు క్రిష్ ఈ సినిమాను తెరపైకి తీసుకు వస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే పవన్ ఈ ఏడాది ఉగాదికి సముద్రఖనితో సినిమాను ప్లాన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే సాయి ధరంతేజ్ కూడా తన ప్రస్తుత సినిమా పూర్తి చేసుకొని ఉగాదికి సిద్ధంగా ఉంటాడట. నాలుగు నెలల్లోనే షూటింగ్ ను పూర్తి చేసే విధంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో వినాయన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి. ఇక మరోవైపు పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











