పవన్ మాటలు ఎన్టీఆర్ ని ఉద్దేశించా!?
పవన్ కళ్యాణ్ పంజా పంక్షన్ జరిగిన నాటి నుంచి మీడియాలో రకరకాల కథనాలు ప్రసారమవుతున్నాయి.నిన్నటి దాకా పంజా పంక్షన్ కి మెగా కుటుంబ సభ్యులు ఎందుకు రాలేదనేది హాట్ టాపిక్ గా మారింది.నాగబాబు లైవ్ లోకి వచ్చి దానికి సమాధానం చెప్పారు.ఇప్పుడు పంజా పంక్షన్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ...నేనెప్పుడూ ఏ డైరక్టర్ ని నాతో సినిమా చేయమని రిక్వస్ట్ చేయలేదు.నేను అలాంటి వ్యక్తిని కాదు అన్నారు.సమయం వచ్చినప్పుడు మీరు అడుగుతున్న రాజమౌళి కాంబినేషన్ సినిమా వస్తుందని చెప్పుకొచ్చారు.అయితే ఇప్పుడు ఎన్టీఆర్ ఊసరవెల్లి ఆడియో సమయంలో రాజమౌళి తో సినిమా చేయాలని ఉందని స్టేజీ మీద అడగటం ఈ సందర్భంగా అందరూ గుర్తు చేసుకుంటున్నారు.
ఎన్టీఆర్ అలా అడగటాన్ని దృష్టిలో పెట్టుకునే పవన్ ఈ మాటలు అన్నాడని కొందరు చెప్పుతున్నారు.అయితే అది పవన్ క్యాజువల్ గా అన్న మాటలు.దానికి అంత పెడర్ధాలు తీయాల్సిన పనిలేదనేది నిజం.రాజమౌళి కూడా ఆ ఫంక్షన్ ఉత్సాహంగా.."వపర్‌స్టార్‌ని కలవడానికి నేను కోల్‌కతాకి వెళ్ళాను. కానీ ఆయన షూటింగ్ ఆరోజు లేదు. ఈ రోజు స్టేజి మీద కలవడం ఆనందంగా ఉంది. సినిమా టైటిల్ చిరిగిపోయింది. పవన్‌తో నేను సినిమా చేసే విషయం ఆయన చేతుల్లోనే ఉంది''అన్నారు.వీరి కాంబినేషన్ సినిమా ఎలా ఉన్నా అబిమానుల మధ్య చిచ్చు రేగకుండా చాలు.


Click it and Unblock the Notifications











