పండగను టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్.. కన్ఫ్యూజన్‌లో యువ హీరోలు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలాంటి సినిమా చేసినా కూడా ఓపెనింగ్స్ తోనే బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేస్తాడని చెప్పవచ్చు. ఇక ఆయన నుంచి చాలా కాలం తరువాత వకీల్ సాబ్ సినిమా రాబోతోంది అంటే దాని హడావిడి ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. గతంలో ఎప్పుడు లేని విధంగా చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్న పవన్ ఇటీవల షూటింగ్ తో మళ్ళీ బిజీ అయ్యాడు.
పింక్ సినిమాకు రీమేక్ గా వస్తున్న సినిమా కావున ఓ వర్గం ఆడియెన్స్ లో అంచనాలు భారీగానే ఉన్నాయి. విడుదలైన మొదటి పాటకు భారీ స్థాయిలో క్రేజ్ అందింది. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ పోస్టర్స్ కి కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో మరో అప్డేట్ ఇవ్వాలని అభిమానులు నిర్మాత దిల్ రాజుపై ఒత్తిడి తెస్తున్నారు. ఇక డిసెంబర్ లో వీలైనంత త్వరగా షూటింగ్ ని పూర్తి చేసి రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నారు.

ఇక సంక్రాంతి పండగకు సినిమాకు విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సంక్రాంతికి విడుదల చేయాలని రామ్ రెడ్ సినిమాతో రెడీగా ఉండగా రానా అరణ్యని సిద్ధం చేశారు. అక్కినేని అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో సంక్రాంతికి రానున్నట్లు ఎప్పుడో చెప్పాడు. ఇక రవితేజ క్రాక్ కూడా రెడీగా ఉంది. అయితే అదే సంక్రాంతిని పవన్ టార్గెట్ చేయడంతో యువ హీరోలు కొంత టెన్షన్ పడుతున్నారు. పెద్ద సినిమాల ఎఫెక్ట్ ఎంతో కొంత పడవచచ్చని తెలుస్తోంది. మరి ఈ ఊహాగానాలు ఎంతవరకు నిజమవుతాయో చూడాలి.


Click it and Unblock the Notifications











