గీతా ఆర్ట్స్ కు పవన్ గ్రీన్ సిగ్నల్,దర్శకుడు ఎవరంటే...
హైదరాబాద్ : పవన్ కల్యాణ్ ని పరిచయం చేస్తూ అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి చిత్రం రూపొందించింన గీతా ఆర్ట్స్ ఆ తర్వాత జల్సా, జానీ చిత్రాలు పవన్ తో చేసింది. తాజాగా మరో చిత్రం పవన్ తో కమిటైంది. అల్లు అరవింద్ నిర్మించే ఈ చిత్రం త్రివిక్రమ్ తో పవన్ చేసే చిత్రం అనంతరం మొదలుకానుందని సమాచారం. త్వరలోనే ఈ మేరకు అఫీషియల్ గా ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాసం ఉంది.
ఇక ఈ భారీ క్రేజీ చిత్రానికి ప్రముఖ దర్శకుడు మురగదాస్ దర్శకత్వం వహించనున్నారని సమాచారం. మురగదాస్ కి అల్లు అరవింద్ కి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. గతంలో మురగదాస్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన గజనీ చిత్రం తెలుగు వెర్షన్ ని అల్లు అరవింద్ తమ బ్యానర్ పైనే విడుదల చేసి ఘన విజయం సాధించారు. ఆ తర్వాత మురగదాస్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా స్టాలిన్ , ఠాగూర్ రీమేక్ చిత్రాలు రూపొందించటానికి అల్లు అరవింద్ ప్లాన్ చేసారు. అంతేకాక హిందీలో అమీర్ ఖాన్ తో గజనీ చిత్రం నిర్మాత కూడా అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానరే. ఆ బంధంతోనే ఇప్పుడు మురగదాస్ దర్శకత్వంలో పవన్ హీరోగా చిత్రం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం మురగదాస్ హిందీలో తుపాకి రీమేక్ సన్నాహాల్లో ఉన్నారు. విజయ్ హీరోగా రూపొందించిన తుపాకి చిత్రం తమిళంలో వంద కోట్ల వరకూ వసుూలు చేసి రికార్డులు క్రియేట్ చేసింది. తెలుగులో అయితే ఈ చిత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. విజయ్ కి ఇక్కడ మార్కెట్ లేకపోవటమే కారణమని తేలింది.
పవన్ విషయానికి వస్తే...త్రివిక్రమ్ తో చేయబోయే చిత్రం నువ్వు నాకు నచ్చావ్ తరహా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుంది. మురగదాస్ తో చేయబోయే చిత్రం ఓ సామాజిక అంశం కలుపుకున్న యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. మురగదాస్ దర్శకత్వంలో పవన్ చేయటంపై ఫ్యాన్స్ లో ఆనందం వ్యక్తం అవుతోంది.


Click it and Unblock the Notifications











