ఆ సన్నివేశాలను చూసి ప్రేక్షకులే కాదు..హీరోహీరోయిన్లు కూడా ఏడుస్తారు పవన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిజంగానే ఏడ్చిన సంఘటన కొమరం పులి చిత్రీకరణలో చోటుచేసుకుందట. ఈ విషయాన్ని పవన్ కళ్యాణే వివరించాడు. కొమరం పులి చిత్రం ఆడియో కార్యక్రమం సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..తాను రికార్డులు కోసం ఏ సినిమాను ఇంతవరకూ చేయలేదనీ, కొన్ని సినిమాలు అనుకోకుండా సక్సెస్ లు సాధించాయని చెప్పుకొచ్చారు. అదేవిధంగా తన తాజా చిత్రం కొమరం పులిలో గుండెను పిండేసే ఓ పాట ఉందన్నాడు.
తండ్రి గురించి వర్ణస్తూ పాడే ఆ పాట లో తాను నటించేటప్పుడు ఏడ్చేశానని పవన్ కళ్యాణ్ అన్నాడు. ఆ సన్నివేశంలో నటించేటప్పుడు తన తండ్రి వెంకట్రావు గారు గుర్తుకు వచ్చారనీ, దాంతో నిజంగానే ఏడ్చేశానన్నారు. హృద్యమైన సన్నివేశాలను చూసి ప్రేక్షకులే కాదు...ఆ సన్నివేశాలలో నటించే హీరోహీరోయిన్లు కూడా ఏడుస్తారని పవన్ వివరించారు..


Click it and Unblock the Notifications











