'గబ్బర్ సింగ్' ఎఫెక్టు: పవన్ ప్లాప్ రీరిలీజ్

By Srikanya

పవన్, త్రిష కాంబినేషన్ లో రూపొందిన తీన్ మార్ చిత్రం రీ రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేయటానకి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. బండ్ల గణేష్ నిర్మించిన ఈ చిత్రం అప్పట్లో డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అయితే పాటలు బాగున్నా ఎడిటింగ్, వాయిస్ మిక్సింగ్సరిగా లేకపోవటం సమస్యగా మారిందని చెప్పుకున్నారు. అయితే ఇప్పుడా ఆ టెక్నికల్ సమస్యలను సరిచేసి మళ్లీ విడుదల చేద్దామనే ఆలోచనలో ఉన్నట్లు చెప్తున్నారు. దీనికి పవన్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వినికిడి.


గబ్బర్ సింగ్ సూపర్ హిట్ కావటంతో ఫ్యాన్స్ అదే వేడిలో ఈ చిత్రాన్ని ఆదరించే అవకాసం ఉందని భావిస్తున్నారు. అప్పట్లో ఈ చిత్రంలో రెండు సీన్స్ బాగా విమర్శలు పొందాయి. అభిమానులు సైతం వీటిని నచ్చేలేదన్నారు. అవి ఫస్టాఫ్ లో త్రిషను చూసి పవన్ కళ్యాణ్ ఇటాలియన్ భాషలో చెప్పే లెంగ్తీ డైలాగ్ ఉన్న సన్నివేశం. రెండవది..అలీ తో ఉన్న హోటల్ సీక్వెన్స్. త్రాగేసి డైలాగులు చెప్పటం అవసరమా అనిపించింది ని కామెంట్స్ వినిపించాయి. ఈ రీరిలీజ్ లో అయినా ఈ రెండు సీన్స్ ఎడిటింగ్ చేసి ఇంకా బాగా రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు.

ఇకమిగిలిన సినిమా అంతా పవన్ కల్యాణ్ స్టైల్ తో చేసిన మ్యాజిక్. ఇక స్పాట్ డబ్బింగ్ చెప్పించటం తో ఫస్టాఫ్ లో చాలా సీన్స్ లో డైలాగులు అర్దం కాలేదనే విమర్శ వినిపించింది. వాటిని కూడా మళ్లీ పవన్ డబ్బింగ్ చెప్పి మార్చి విడుదల చేస్తే బెస్ట్. ఇక పవన్ ఈ చిత్రంలో చేసిన రెండు పాత్రలకు వేరియేషన్ చూపిస్తూ చేసారు.

ఇక అప్పట్లో 'తీన్‌మార్‌" చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ... 'తీన్ మార్' టైటిల్‌ పెట్టడానికి చాలా ఆలోచించాల్సొచ్చింది.తర్జనభర్జన జరిగాక చివరికి నేనే టైటిల్‌ సూచించాను. అందరికీ నచ్చింది. అలాగే హిందీ వెర్షన్‌లో ఉన్న కథను అలానే తీస్తే ఇక్కడ ఒక్కరోజు కూడా ఆడదు. అందువల్ల మూలకథను అలానే ఉంచి కథనపరంగా మార్పులు చేశాం అన్నారు జయంత్ సి.పరాంన్జీ.

అలాగే హీరోకి తగ్గట్టు డాన్సులు, ఫైట్స్‌, డైలాగులు అన్నీ సమకూర్చాం. ఏ దర్శకుడయినా రీమేకులు ఎప్పుడూ ఉన్నదున్నట్టుగా తీయకూడదు. స్థానిక సంస్కృతికి తగ్గట్టు మలుచుకోవాలి అన్నారు.అంతేగాక ప్రేమకథలు నా వీక్‌నెస్‌ అందుకనే అంత బాగా తీసాను అని చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X