పవన్ కళ్యాణ్ 'తీన్ మార్' విడుదల వాయిదా
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం తీన్ మార్ ని మొదట మార్చి చివరి వారంలో విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు ప్లాన్ చేసారు. కానీ తాజా సమాచారం ప్రకారం విడుదలను ఏప్రియల్ 22కి ఫోస్ట్ ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం బాలీవుడ్ హిట్ లవ్ ఆజ్ కల్ కి రీమేక్. త్రివిక్రమ్ రచన చేస్తున్న ఈ చిత్రాన్ని జయంత్ పరాంన్జీ డైరక్ట్ చేస్తున్నారు. పరమేశ్వర ఆర్ట్ పతాకంపై హాస్య నటుడు గణేష్ దీనిని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం ఆడియో మార్చి మొదటి వారంలో భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రాంతానికి చెందిన స్టూడెంట్ గా కనిపంచనున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. త్రిష హీరోయిన్ గా చేస్తోంది.


Click it and Unblock the Notifications











