పవన్ కళ్యాణ్ ‘తీన్ మార్’టైటిల్ రచ్చకి నితిన్ రియాక్ట్ అవుతాడా...!
పనవ్ కళ్యాణ్ కి, తెలంగాణకి మంచి అవినాభావ సంబంధమే వుంది. రాష్ట్రం మొత్తంలో పవర్ స్టార్ కున్న ఫాలోయింగ్ తెలంగాణలో ఎక్కువయితే, వారిని సంతోషపరచడానికి పవన్ కూడా ఎప్పుడూ ఏదో ఓ తెలంగాణ మాండలికాన్ని తన సినిమాల్లో ఇరికించేస్తుంటాడు. కానీ ముదురుతున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సమస్య దృష్ట్యా ఈయనకూ కష్టాలు తప్పేట్టు లేవు. తెలంగాణ వాదుల ఒత్తిడి మేర 'కొమరం పులి"లో కొమరం పీకేసి 'పులి" పేరుతో సినిమాను విడుదల చేసుకున్న పవన్ కు ఈసారి 'తీన్ మార్" లోనూ ఇంకో సమస్య తలెత్తింది.
అదేమిటంటే..'తీన్ మార్" అన్న సాంస్పృతిక పదం తెలంగాణ సొత్తు అంటూ తెలంగాణలోని కళాసాహితీ సంఘాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. టైటిల్ ను మార్చని పక్షంలో సినిమాను తెలంగాణలో విడుదల కానివ్వం అంటూ కారాలు నూరుతున్న తెలంగాణ పిడివాదులతో పవన్ పెట్టుకోలేడు. మరి 'కొమరం"పీకి పక్కనేసినట్లైగా 'తీన్ మార్"లో 'తీన్" తీసి పడేస్తే మిగిలేది'మార్" ఒక్కటే. మరి అలాచేస్తే నితిన్ ఫీలవుతాడేమో?వేచి చూడాల్సిందే..


Click it and Unblock the Notifications











