'తొలి ప్రేమ' రీమిక్స్ సాంగ్ లో పవన్!?
వేరే హీరోలు చేసిన పాటలు రీమిక్స్ చేసి తమ సినిమాల్లో వాడుకోవటం రెగ్యులర్ గా జరిగేదే. అయితే పవన్ కళ్యాణ్ కాస్త భిన్నంగా వెళ్ళదలిచారు. తన సూపర్ హిట్ 'తొలి ప్రేమ' చిత్రంలోని 'నా మనసే..సే..' అనే పాటను తన తాజా చిత్రం 'లవ్ ఆజ్ కల్' రీమేక్ లో ఉపయోగించదలిచారని సమాచారం. జయంత్.సి.పరాంన్జీ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో ఇలియానా హీరోయిన్ గా చేస్తోంది. అలాగే లీడర్ హీరోయిన్ రిచా ఉపాధ్యాయ కూడా మరో పాత్రను చేస్తోంది. హాస్య నటుడు గణేష్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక పాట రీమిక్స్ అయినా చిత్రీకరణ మాత్రం కొత్తగా మార్చి చేస్తామంటున్నారు. ఇక ఈ చిత్రానికి ఖుషీగా అనే టైటిల్ పెట్టనున్నారు. పవన్ తో జల్సా హిట్ కొట్టిన త్రివిక్రమ్ ఈ చిత్రానికి రచన చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ఇలియానా ఖుషీగా లవ్ ఆజ్ కల్ జయంత్ సి పరాంన్జీ pawan kalyan ileana tholiprema trivikram love aaj kal


Click it and Unblock the Notifications