బన్నీ సినిమాలో పవన్ కి 'బిగ్ థాంక్స్'
అల్లు అర్జున్ తాజా చిత్రం జులాయి ప్రారంభంలో పవన్ కళ్యాణ్ కి బిగ్ థాంక్స్ అని కార్డు పడనుందని సమాచారం. దానికి కారణం పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో కొన్ని సీన్స్ కి తన దైన స్టైల్ లో టిప్స్ చెప్పి,స్పైస్ అద్దాడని తెలుస్తోంది. త్రివిక్రమ్ ద్వారా మొత్తం స్క్రిప్టు తెలుసుకున్న పవన కళ్యాణ్ ఈ చిత్రంలో కొన్ని మార్పులు చెప్పి,అల్లు అర్జున్ కి ఎలా చేయాలో వాటిని తెలియచేసాడని,ఆ సీన్స్ తెరపై భీభత్సంగా పేలుతాయని చెప్పుకుంటున్నారు.
ఇక అల్లు అర్జున్,త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న జులాయి చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ ఆడియో పంక్షన్ కి రామ్ చరణ్,పవన్ కళ్యాణ్ ఇద్దరూ వస్తున్నారని సమాచారం. ఈ ఆడియో పంక్షన్ ఈ నెల పదవ తేదీన హైదరాబాద్ లోని హెఐసిసి లో జరగనుంది. జల్సా,మగధీర తర్వాత మెగా ఫ్యామిలీ మొత్తం ఆడియో ఫంక్షన్ కి హాజరవుతున్న వేదిక ఇదే. అల్లు అర్జున్,ఇలియానా కాంబినేషన్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న రొమాంటిక్ ఎంటర్టనర్ 'జులాయి'. ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకన్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. గబ్బర్ సింగ్ తో ఊపు మీదున్న దేవి ఈ ఆడియోని అదరకొట్టాడని చెప్తున్నారు.
అల్లు అర్జున్,ఇలియానా కాంబినేషన్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న రొమాంటిక్ ఎంటర్టనర్ 'జులాయి'. అల్లు అర్జున్ మాట్లాడుతూ...''త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించడం ఓ అందమైన అనుభవం. అలాగే మళ్లీ నా సినిమాకు దేవిశ్రీ మ్యూజిక్ ఇవ్వడం, ఇలియానాతో తొలిసారి నటించడం ఆనందంగా ఉంది. రాజేంద్రప్రసాద్‌గారితో తొలిసారి నటిస్తున్నాను. ఆయన డైలాగ్ టైమింగ్ సూపర్బ్. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇందులో డైలాగ్స్‌కి విజిల్స్ పడతాయి'' అని అన్నారు.
సోనూసూద్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, రావు రమేష్, బ్రహ్మాజీ, తులసి, హేమ, ప్రగతి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: రవీందర్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, నిర్మాణం: హారిక అండ్ హాసిని క్రియేషన్స్.


Click it and Unblock the Notifications











