బాలకృష్ణ టైటిల్ తో పవన్ సినిమా!?

By Srikanya

చిరంజీవి టైటిల్ అధినాయకుడుని ఆ మధ్య బాలకృష్ణ సినిమాకు పెట్టనున్నారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యలో బాలకృష్ణ కోసం అనుకున్న 'పంజా"టైటిల్ ని పవన్ కళ్యాణ్ చిత్రానికి ఫైనలైజ్ చేసే అవకాసం ఉందని తెలుస్తోంది.ఇక ఇప్పటికే నిర్మాత టైటిల్ విషయమై మీడియా మీట్ ఏర్పాటు చేసి మరీ క్లారిఫికేషన్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్-దర్శకుడు విష్ణు వర్ధన్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాకు 'తిలక్" అనే టైటిల్ ఖరారు చేసినట్లు వస్తున్న వార్తలను ఆ సినిమా నిర్మాత శోభు యార్లగడ్డ తోసిపుచ్చారు. తిలక్ అనే టైటిల్ ఫైనల్ చేసినట్లు కొన్ని మీడియా వెబ్ సైట్లలో పేర్కొనడాన్ని ఆయన ఖండించారు. అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు.

ప్రస్తుతం ఈ సినిమా వర్కింగ్ టైటిల్‌గా షాడో గా ఉంది. దీన్నే కొందరు కాళీ అంటున్నారు. ఎవరి ప్రచారం ఎలా ఉన్నా అక్టోబర్‌లో దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించనున్నారు. అప్పటి వరకు ఎలాంటి ప్రచారాన్ని నమ్మవద్దని అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆర్.ఎఫ్.సి, హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సినిమాలో పవర్ స్టార్ సరసన సారా జాన్ డియాస్, అంజనా లవానియాలు నటిస్తుండగా, అడవి శేష్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమాను...ఆర్కా మీడియా, సంఘమిత్ర ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విజయ దశమి నాడు విడుదల చేస్తారు. శోభుయార్లగడ్డ, తిరుమలశెట్టి నీలిమ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్‌లో విడుదలకు సిద్ధమవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X