For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Pawan Kalyan Next With Puri Jagan: బడా నిర్మాత సూపర్ ప్లాన్.. మహేశ్ కథనే పవర్ స్టార్ కోసం!

  |

  రీఎంట్రీలో జెట్ స్పీడుతో దూసుకుపోతున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇప్పటికే 'వకీల్ సాబ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన.. అది పట్టాలపై ఉండగానే మరిన్ని చిత్రాలను లైన్‌లో పెట్టుకున్నాడు. వాటిని ఒక్కొక్కటిగా పూర్తి చేయాలని భావించాడు. ఇంతలో కరోనా ప్రభావం భారీగా చూపించడంతో ఏక కాలంలో రెండు సినిమాలను చేస్తున్నాడు. ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయిన పవన్ కల్యాణ్.. డైనమిక్ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం!

  రీఎంట్రీ అదిరింది... కలెక్షన్లే నిరాశగా

  రీఎంట్రీ అదిరింది... కలెక్షన్లే నిరాశగా

  ఫ్యాన్స్ మూడేళ్ల నిరీక్షణ తర్వాత ‘వకీల్ సాబ్' అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు పవన్ కల్యాణ్. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. ఫలితంగా ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే, టికెట్ రేట్ల తగ్గింపుతో పాటు కరోనా వైరస్ ప్రభావం ఉన్న కారణంగా ఈ సినిమా ఫుల్ రన్‌లో నష్టాలనే ఎదుర్కోవాలని వచ్చింది.

  పవన్ రెండు సినిమాలు ఏకకాలంలో

  పవన్ రెండు సినిమాలు ఏకకాలంలో

  ప్రస్తుతం పవన్ కల్యాణ్.. మలయాళ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్‌లో దగ్గుబాటి రానాతో కలిసి నటిస్తున్నాడు. సాగర్ కే చంద్ర రూపొందిస్తోన్న ఈ సినిమాను నాగవంశీ నిర్మిస్తున్నాడు. దీనితో పాటే క్రిష్ జాగర్లమూడితో కలిసి ‘హరిహర వీరమల్లు' అనే పిరియాడిక్ మూవీని కూడా చేస్తున్నాడు. మెగాసూర్య బ్యానర్‌పై ఏఎమ్ రత్నం ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

  హిట్ ఇచ్చిన దర్శకుడితో ఇంకొకటి

  హిట్ ఇచ్చిన దర్శకుడితో ఇంకొకటి

  ‘వకీల్ సాబ్' మూవీ పట్టాలపై ఉన్న సమయంలోనే పవన్ కల్యాణ్ ఎన్నో ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందులో హరీశ్ శంకర్ తెరకెక్కించే చిత్రం కూడా ఒకటి ఉంది. ‘గబ్బర్ సింగ్' వంటి భారీ విజయం తర్వాత వీళ్లిద్దరి కాంబోలో ఈ మూవీ రాబోతుంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే స్క్రిప్ట్ రెడీ అవుతోంది.

  పవన్ తర్వాత సినిమాలపై ప్రచారం

  పవన్ తర్వాత సినిమాలపై ప్రచారం

  వరుసగా సినిమాలను లైన్‌లో పెట్టుకుంటూ వెళ్తోన్న పవన్ కల్యాణ్.. ప్రస్తుతం ప్రకటించిన మూడు చిత్రాల తర్వాత ఎవరితో కలవబోతున్నాడన్న దానిపై ఆసక్తి నెలకొంది. అతడు త్రివిక్రమ్‌తో సినిమా చేయబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే, మరికొందరు దర్శకుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ఈ ప్రాజెక్టు ఏమై ఉంటుందోనని అంతా ఆసక్తిగా చూస్తున్నారు.

  పూరీ జగన్నాథ్‌తో పవన్ సినిమా

  పూరీ జగన్నాథ్‌తో పవన్ సినిమా

  పవన్ కల్యాణ్‌కు స్టార్‌డమ్‌ను అందించిన చిత్రం ‘బద్రీ'. దీన్ని పూరీ జగన్నాథ్ రూపొందించిన విషయం తెలిసిందే. దీని తర్వాత వీళ్లిద్దరూ కలిసి ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' అనే సినిమా చేశారు. ఇది అంతగా ఆడలేదు. ఇక, పవన్ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ కాంబో మరోసారి తెరపైకి వచ్చింది. కానీ, క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా పూరీతో అతడు సినిమా చేస్తున్నట్లు తెలిసింది.

  బడా ప్రొడ్యూసర్ అదిరిపోయే ప్లాన్

  బడా ప్రొడ్యూసర్ అదిరిపోయే ప్లాన్

  పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ మరో సినిమా చేయబోతున్నాడని తాజాగా ఓ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు కూడా జరిగాయని అంటున్నారు. ఇందుకోసం టాలీవుడ్‌లోని ఓ బడా ప్రొడ్యూసర్ ప్లాన్లు చేస్తున్నట్లు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. పవన్ ఓకే అన్న వెంటనే ఈ ప్రకటన రాబోతుందని సమాచారం.

  NKR 18 Bimbisara, Kalyan Ram As A Barbarian King || Filmibeat Telugu
  డ్రీమ్ ప్రాజెక్టునే ఇలా చేస్తున్నాడుగా

  డ్రీమ్ ప్రాజెక్టునే ఇలా చేస్తున్నాడుగా

  మహేశ్ బాబుకు పూరీ జగన్నాథ్ ‘పోకిరి', ‘బిజినెస్‌మ్యాన్' వంటి సూపర్ హిట్లను అందించాడు. వీటి తర్వాత వీళ్ల కాంబోలో ‘జనగణమన' ఉంటుందని ఎప్పుడో ప్రకటించారు. కానీ, ఇద్దరి మధ్యా దూరం పెరగడంతో అది కాస్తా పట్టాలెక్కలేదు. ఇప్పుడిదే కథతో పూరీ జగన్నాథ్.. పవన్ సినిమా చేస్తారని తెలుస్తోంది. అన్నట్లు ఇప్పుడీ డైరెక్టర్ విజయ్‌తో ‘లైగర్' అనే మూవీ చేస్తున్నాడు.

  English summary
  Tollywood Star Hero Pawan Kalyan Doing Several Films at One Time. Now He Desieded to Do a Movie with Puri Jagannadh. This Movie Ready with Jana Gana Mana Script.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X