For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Mahesh Babu కోసం కోట్లు ఖర్చు పెట్టబోతున్న పవన్ కళ్యాణ్.. ఈ కాంబో సెట్టయితే అరాచకమే!

  |

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక సినిమాను మొదలు పెడితే ముందుగానే అన్ని క్లియర్ గా ఉన్నాయా లేదా అనే విషయాలపై ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు. ముఖ్యంగా ప్రొడక్షన్ విషయంలో ఏ మాత్రం తేడా రాకూడదని పర్ఫెక్ట్ అగ్రిమెంట్ తో ముందుకు వెళుతూ ఉంటారు. సాధారణంగా ఒక సినిమా ఫ్లాప్ అయితే అందరి కంటే ఎక్కువగా నష్టపోయేది నిర్మాత అని అందరికి తెలిసిన విషయమే. అయితే ప్రస్తుతం నున్న అగ్ర హీరోల్లో కొందరు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు గాని.. మహేష్ బాబు మాత్రం తన ప్రతి సినిమా రిజల్ట్ పై బాధ్యతగా ఉంటాడు. ఒక సినిమా సక్సెస్ అయితే అది అందరి కృషి అని తెలియజేసే మహేష్ బాబు అదేవిధంగా ఫ్లాప్ అయితే తప్పు తనేది అను ఓపెన్ గా చెప్పేస్తుంటాడు. సినిమా ప్లాప్ అయ్యింది అంటే మహేష్ బాబు కొన్ని రోజుల వరకు ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా తనలో తానే మదనపడుతూ ఉంటాడు.

  మహేష్ బాబు - పవన్ కళ్యాణ్ కాంబో..

  మహేష్ బాబు - పవన్ కళ్యాణ్ కాంబో..

  మహేష్ బాబు అపజయాన్ని ఏ మాత్రం అంత ఈజీగా తీసుకోడని, ఆ విషయం ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకే సూపర్ స్టార్ తో సినిమా చేయాలని టాలీవుడ్ లో చిన్న నిర్మాతల నుంచి పెద్దల వరకు ఎంతో ఆసక్తి కనబరుస్తారు. మహేష్ కూడా నిర్మాతలకు ఒక ప్రత్యేకమైన గౌరవం ఇస్తాడు. అసలు మేటర్ లోకి వస్తే ప్రస్తుతం మహేష్ బాబు పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో సినిమా రాబోతున్నట్లు సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. గతంలో చాలా సార్లు ఈ కాంబినేషన్ పై వార్తలు చాలానే వచ్చాయి. ఆ మధ్య మహేష్ బాబు కూడా రూమర్స్ పై స్పందించాడు.

   పవన్ తో వర్క్ చేయడానికి సిద్ధమే

  పవన్ తో వర్క్ చేయడానికి సిద్ధమే

  సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా అనంతరం మరొక స్టార్ హీరో తో నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని పవన్ కళ్యాణ్ తో కూడా నటించడానికి తాను సిద్ధం అని చెప్పాడు. అయితే ఎవరు కూడా ఆ కాంబినేషన్ పై కథలను కూడా చెప్పింది లేదని ఒకవేళ వస్తే కనుక ఏ మాత్రం సందేహం లేకుండా తాను చేయడానికి సిద్ధమని కూడా సూపర్ స్టార్ ఆన్సర్ ఇచ్చారు.

  పవన్, మహేష్ అనుబంధం

  పవన్, మహేష్ అనుబంధం

  పవన్ కళ్యాణ్ మహేష్ బాబు కు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. గతంలో అర్జున్ సినిమా పైరసీ సినిమా కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావాన్ని చూపించినప్పుడు మహేష్ బాబు ప్రత్యేకంగా పోరాటానికి దిగారు. ఆ సమయంలో ఇండస్ట్రీలో నుంచి మొట్టమొదటగా సపోర్ట్ చేసిన స్టార్ హీరో పవన్ కళ్యాణ్ మాత్రమే. ఆ విషయం అందరికి తెలిసిందే. ఇక త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన జల్సా సినిమాలో మహేష్ బాబు పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకంగా వాయిస్ ఓవర్ ఇచ్చి అభిమానులకు మంచి కిక్కిచ్చారు. అభిమానులు అయితే వీరి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తే బాగుంటుందని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

   మహేష్ సినిమా కోసం నిర్మాతగా పవన్

  మహేష్ సినిమా కోసం నిర్మాతగా పవన్

  అయితే అలాంటి మల్టీస్టార్ వస్తుందో లేదో తెలియదు కానీ మహేష్ బాబు కోసం మాత్రం పవన్ కళ్యాణ్ ఒక సినిమాకు నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్న మహేష్ బాబు ఆ ప్రాజెక్టు అనంతరం త్రివిక్రమ్ తో SSMB28 ప్రాజెక్ట్ ను మొదలు పెట్టబోతున్నాడు. అతడు - ఖలేజా అనంతరం మహేష్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూడవ సినిమాపై అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. ఇక సినిమాను హారిక హాసిని ప్రొడక్షన్ లోనే చినబాబు భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఇక ఈ ప్రొడక్షన్ తో పాటు PK క్రియేటివ్ వర్క్స్ కూడా కలవనున్నట్లు తెలుస్తోంది.

   భారీగా పెట్టుబడి

  భారీగా పెట్టుబడి

  SSMB28 పవన్ కళ్యాణ్ భారీగా పెట్టుబడి పెట్టేందుకు ఒప్పుకున్నట్లు అయితే టాక్ వస్తోంది. ఈ కాంబినేషన్ సెట్ చేయడానికి ప్రధాన కారణం త్రివిక్రమ్ అని కూడా కథనాలు వెలువడుతున్నాయి. మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ని కలిపితే తప్పకుండా సినిమా మరో స్థాయికి వెళుతుంది అని మాటల మాంత్రికుడు ఆలోచించారట. ఇక మహేష్ బాబు అయితే చాలా వరకు తనకు నచ్చిన సినిమాకు సొంత ప్రొడక్షన్ హౌస్ అయినటువంటి GMB ఎంటర్టైన్మెంట్స్ ను జత చేస్తూ వస్తున్నాడు.

  Vihari tweets about Pspk rana movie | Filmibeat Telugu
  రెమ్యునరేషన్ తీసుకోకుండా..?

  రెమ్యునరేషన్ తీసుకోకుండా..?

  గత కొంత కాలంగా మహేష్ బాబు వీలైనంత వరకు రెమ్యునరేషన్ తీసుకోకుండా లాభాల్లో వాటాలు అందుకుంటూ వస్తున్నాడు. అయితే ఈ ప్రాజెక్టు విషయానికి వచ్చేసరికి త్రివిక్రమ్ రెమ్యునరేషన్ ఇచ్చేలా డీల్ సెట్ చేస్తున్నట్లు టాక్ వస్తోంది. ఇక సారి హాసినీ హారిక ప్రొడక్షన్ తో పాటు పీకే క్రియేటివ్ వర్క్స్ కూడా ప్రొడక్షన్ లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదివరకే ఈ విషయంపై మహేష్ బాబు తో ఒకసారి చర్చలు జరిపారట. కానీ మహేష్ బాబు నుంచి ఇంకా ఎలాంటి సమాధానం రాలేదని తెలుస్తోంది. సర్కారు వారి పాట కీలక షెడ్యూల్ ముగిసిన అనంతరం ఈ విషయంపై మహేష్ బాబు చిత్ర నిర్మాత చినబాబు, త్రివిక్రమ్ తో మరోసారి చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. మరి మహేష్ బాబు పవన్ కళ్యాణ్ నిర్మాతగా అంటే ఒప్పుకుంటాడో లేదో చూడాలి.

  English summary
  Trivikram srinivas mastar plan on upcoming movie and Pawan Kalyan to produce mahesh babu SSMB 28,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X